ETV Bharat / sports

Virat Kohli Captaincy: కోహ్లీ.. వన్డేల్లోనూ కెప్టెన్​గా తప్పుకోవాలన్న శాస్త్రి!

author img

By

Published : Sep 23, 2021, 10:24 AM IST

టీ20 కెప్టెన్​గా విరాట్ కోహ్లీ (Virat Kohli Captaincy) తప్పుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. వైట్​బాల్​ కెప్టెన్సీని పూర్తిగా వదిలేయాలని విరాట్​ కోహ్లీకి టీమ్​ఇండియా హెడో కోచ్ రవిశాస్త్రి సూచించినట్లు తెలుస్తోంది.

Virat Kohli captaincy
విరాట్ కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో కెప్టెన్సీ(Virat Kohli Captaincy) వదులుకోవాలని ప్రధాన కోచ్ రవిశాస్త్రినే చెప్పారట. టెస్టుల్లో జట్టుకు సారథ్యం వహిస్తూ బ్యాటింగ్​పై దృష్టి పెట్టడంలో భాగంగానే ఈ పని చేయమన్నట్లు సమాచారం.

అందుకేనా?

"ఈ సూచన కోహ్లీని తక్కువ చేయడానికి కాదు. ప్రపంచ క్రికెట్​లో అతడు టాప్​ బ్యాట్స్​మన్​గా కొనసాగడం కోసమే" ఓ వార్త సంస్థ పేర్కొంది. విరాట్ మాత్రం శాస్త్రి సూచనలు వినకుండా కేవలం టీ20 సారథ్యాన్ని (Virat Kohli T20I Captaincy) మాత్రమే వదులుకొని, వన్డేల్లో కెప్టెన్​గా కొనసాగుతున్నట్లు తెలిపింది.

రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియా సిరీస్​ గెలిచింది టీమ్​ఇండియా. నాటి నుంచి కోహ్లీ సారథ్యంపై చర్చలు మొదలయ్యాయి.

6 నెలల క్రితమే..

ఈ వ్యవహారంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. 6 నెలల క్రితమే వైట్​బాల్​ కెప్టెన్సీ విషయమై కోహ్లీతో (Virat Kohli Captaincy) శాస్త్రి మాట్లాడినట్లు తెలిపారు.

"రవిశాస్త్రి చెప్పాడు కానీ కోహ్లీ వినలేదు. వన్డేల్లో సారథ్యం వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. అందుకే టీ20 కెప్టెన్సీ మాత్రమే విడిచిపెట్టాడు. కోహ్లీని బ్యాట్స్​మన్​గా మరింతగా ఉపయోగించుకోవడంపై బోర్డు కూడా చర్చిస్తోంది"

-బీసీసీఐ అధికారి

అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ (Virat Kohli Captaincy) వదులుకుంటున్నట్లు ఈ నెల 16న ప్రకటించాడు విరాట్. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్‌ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్​ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్​కు గురయ్యారు.

ఐపీఎల్​లోనూ..

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2021) వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్‌ క్రికెటర్‌.. ఐపీఎల్‌లోనూ (IPL) కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్​సీబీకి నాయకుడిగా (Kohli RCB Captaincy) ఈ సీజనే తనకు చివరిదని ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్‌ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో (kohli rcb) కొనసాగుతానని విరాట్ చెప్పాడు.

ఆర్​సీబీ VS కోల్​కతా​

ఐపీఎల్​ రెండోదశలోని రెండో మ్యాచ్​లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (RCB vs KKR 2021) కోల్​కతాతో తలపడింది. సీఎస్​కే కంటే కాస్త మెరుగ్గానే ఇన్నింగ్స్​ ప్రారంభించినా 92 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. 9 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది కోల్​కతా.

ఇదీ చూడండి: IPL 2021: కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై ఈ సీజన్​ మధ్యలోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.