ETV Bharat / sports

టీమ్​ఇండియా కొత్త బౌలింగ్​ కోచ్​గా అగార్కర్​!

author img

By

Published : Feb 22, 2022, 3:52 PM IST

Team India new bowling coach: భారత జట్టుకు కొత్త బౌలింగ్​ కోచ్​ రానున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ పేసర్​ అజిత్​ అగార్కర్​ ఈ బాధ్యతలను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్​ క్రికెట్​ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్​ ఆటగాడు అగార్కర్​ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం.

Team India new bowling coach
Team India new bowling coach

Team India new bowling coach: టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకున్న తర్వాత జట్టులో కీలక మార్పులు జరిగాయి. మాజీ కెప్టెన్​ రాహుల్​ ద్రవిడ్​ హెడ్ ​కోచ్​ బాధ్యతలు తలకెత్తున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్​ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే భారత జట్టు బౌలింగ్​ కోచ్​నూ మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత మాజీ పేసర్​ అజిత్​ అగార్కర్​ ఈ బాధ్యతను చేపట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత బౌలింగ్ కోచ్​గా పరాస్​ మాంబ్రే సేవలందిస్తున్నాడు. అతని సేవలపై సంతృప్తిగాలేని భారత జట్టులోని కీలక ఆటగాడు.. అగార్కర్​ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023 సన్నాహాల్లో భాగంగా అగార్కర్​ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

"భారత్​ క్రికెట్​ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్​ ఆటగాడు.. వన్డే ప్రపంచకప్​-2023 నేపథ్యంలో అగార్కర్​ వంటి అనుభవజ్ఞుడు భారతజట్టు బౌలర్లకు మార్గనిర్దేశకుడిగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాడు. మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్​. అతడు భారత-ఎ, అండర్​ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉంటే.. అగార్కర్​ సీనియర్లను చూసుకోవాలని భావిస్తున్నాడు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

44 ఏళ్ల అగార్కర్​.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్​గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ పదవికి పోటీ పడగా నిరాశ ఎదురైంది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు అగార్కర్​ ప్రాతినిధ్యం వహించాడు. 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్​లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 349 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​, దిల్లీ డేర్​డెవిల్స్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్​లు ఆడి 29 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: Chess: ప్రజ్ఞానంద ఖాతాలో మరో రెండు విజయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.