ETV Bharat / sports

న్యూలుక్​లో టీమ్​ఇండియా దిగ్గజం.. టీజ్ చేసిన యువీ!

author img

By

Published : Aug 10, 2022, 7:01 PM IST

టీమ్​ఇండియా దిగ్గజ బ్యాటర్​ సచిన్​ తెందూల్కర్​ న్యూలుక్​లో కనిపించాడు. ప్రస్తుతం మాస్టర్ న్యూలుక్​కు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూసేయండి.

sachin news look
sachin news look

Sachin New Loook: టీమ్​ఇండియా క్రికెట్​ దిగ్గజం.. మాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కొత్త గెటప్​లో కనిపించాడు. తన సోదరుడు నితిన్‌ తెందూల్కర్‌ కుమార్తె పెళ్లి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిశాడు. గోధుమ రంగు షేర్వాణీ ధరించిన సచిన్‌.. ఎర్రటి తలపాగాతో రాజవంశీయుడిగా కనిపించాడు. ఫేటా పెట్టుకుంటున్న వీడియోను సచిన్‌ తన ఇన్​స్టాలో పోస్ట్‌ చేస్తూ.. వెడ్డింగ్‌, షాదీ సెలబ్రేషన్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్స్​ జత చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇక సచిన్‌ పెట్టిన పోస్ట్‌పై టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా స్పందించాడు. సచిన్‌ను టీజ్‌ చేస్తూ.. 'ఓయ్‌ సచిన్‌ కుమార్‌.. హే' అంటూ కామెంట్​ చేశాడు. ఇక సచిన్‌ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని యువీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌కు టైటిల్‌ అందించిన యువరాజ్‌ తన గెలుపును సచిన్‌కు అంకితమిచ్చి.. 'ఇదంతా సచిన్‌ కోసమే' అంటూ పేర్కొనడం అప్పట్లో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి: ICC Rankings: సూర్య జోరు.. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​

Sanju Samson: సంజు నీకే ఎందుకిలా జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.