ETV Bharat / sports

India vs England: ఎంత పనిచేశావ్ జర్వో!

author img

By

Published : Sep 10, 2021, 4:52 PM IST

కరోనా కేసులు కారణంగా భారత్-ఇంగ్లాండ్​ ఐదో టెస్టు(India vs england fifth test) రద్దయింది. అయితే దీనికి కారణమేంటి? బుక్ లాంచ్​ ఈవెంట్​కు మన టీమ్​ సభ్యులు హాజరు కావడమా? జర్వో లాంటి వ్యక్తులు మ్యాచ్​ మధ్యలో మైదానంలోకి రావడమా?

reason behind India vs england fifth test cancellation
జర్వో

టీమ్​ఇండియా కోచింగ్ సిబ్బందిలో ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఇంగ్లాండ్​తో శుక్రవారం జరగాల్సిన ఐదో టెస్టు రద్దయింది. ఇరుబోర్డుల చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వైరస్ పాజిటివ్​గా తేలిన విషయంలో తప్పెవరిది?

జర్వో కారణమా?

భారత్, ఇంగ్లాండ్​ ఆటగాళ్లను బయో బబుల్​ ఉంచి, ఈ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు ప్రాంక్​స్టార్ డేనియల్ జర్వో(jarvo 69).. వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు మైదానంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ అన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలా వచ్చాడు? ఈ పనుల వల్లే హెడింగ్లే మైదానంలో అతడిపై జీవితకాల నిషేధం విధించారు. ఓవల్ గ్రౌండ్​లోకి దూసుకొచ్చినందుకు ఏకంగా జర్వోను అరెస్టు చేశారు.

jarvo 69
మైదానంలో జర్వో(పాత చిత్రం)

అలానే ఈ టెస్టులకు 100 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించారు. వాళ్లలో ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. ఇది కూడా టీమ్​ఇండియాలో కొవిడ్ కేసులు రావడానికి కారణమని అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

బుక్​ లాంచ్ ఈవెంట్​?

ఐదో టెస్టు క్యాన్సిల్ కావడం వల్ల ఇంగ్లీష్ మీడియా భారత జట్టుపై విమర్శలు చేస్తోంది. గతవారం లండన్​లో ఓ బుక్​ లాంచ్ ఈవెంట్​కు టీమ్​ఇండియా కోచ్ రవిశాస్త్రి(ravi shastri covid), కోహ్లీ సహ పలువురు హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకు రవిశాస్త్రికి, ఆ తర్వాత రోజే బౌలింగ్ కోచ్​ భరత్ అరుణ్, ఫీల్టింగ్ కోచ్ ఆర్.శ్రీధర్​కు వైరస్ పాజిటివ్​గా తేలింది. ఈ విషయమై బీసీసీఐ కూడా వివరణ ఇవ్వమని వారిని ఆదేశించింది. బోర్డు అనుమతి లేకుండా పుస్తకావిష్కరణకు హాజరు కావడమే ఈ పరిస్థితికి కారణమా అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి!

ravi shasthri kohli
బుక్​ లాంచ్ ఈవెంట్​లో కోహ్లీ-రవిశాస్త్రి

టెస్టు రద్దు.. కానీ!

ఇరుదేశాల బోర్డులు చర్చించుకుని మ్యాచ్​ను రద్దు చేశాయి. అయితే ఈ మ్యాచ్​ను తిరిగి నిర్వహించే ఆలోచనతో ఉంది భారత క్రికెట్ బోర్డు. సూచన ప్రాయంగా ఈ విషయమై మాట్లాడినప్పటికీ, ఎప్పుడు జరుపుతారు అనేది ఇంకా క్లారిటీ లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.