ETV Bharat / sports

ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌ పై స్పందించిన బీసీసీఐ!

author img

By

Published : Aug 21, 2023, 11:46 AM IST

Updated : Aug 21, 2023, 12:47 PM IST

ODI World Cup 2023 Hyderabad Schedule : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్​ వేదికపై జరిగే వరుస మ్యాచ్​లకు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు గురించి హైదరాబాద్‌ పోలీసుల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

ODI World Cup 2023 Hyderabad Schedule
ODI World Cup 2023 Hyderabad Schedule

ODI World Cup 2023 Hyderabad Schedule : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్​ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మ్యాచ్‌ అక్టోబర్ 9న జరగనుండగా.. పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్‌ ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 10న) ఉంది. అయితే ఈ మ్యాచ్​లకు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి అంటూ హైదరాబాద్‌ పోలీసుల ఆందోళ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని హైదరాబాద్ క్రికెట్‌ సంఘం కూడా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవంటూ స్పష్టం చేశారు.

గత జూన్‌లోనే తొలి షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ, ఐసీసీ, ఆ తర్వాత వివిధ దేశాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాల విజ్ఞప్తుల మేరకు తొమ్మిది మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేస్తూ ఐసీసీ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హెచ్‌సీఏ విజ్ఞప్తి చేసినా రీషెడ్యూల్‌కు అవకాశం ఉండటం కష్టమేనంటూ రాజీవ్ శుక్లా వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది.

Pakistan Matches In World Cup 2023 : మరోవైపు ​పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడం వల్ల భద్రతను మరింత కట్టుదిట్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ పోలీస్‌, క్రికెట్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఉప్పల్​ వేదికగానే పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాక్‌ ఆడనుంది.

ఇప్పటికే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్​ల టికెట్ల విక్రయాలకు సంబంధించి సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు జరగనున్నాయి. ఇక భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి దేశవ్యాప్తంగా పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం కూడా ఒకటి కావడం విశేషం. అయితే ఉప్పల్‌ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవు. దీంతో ఫ్యాన్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ODI World Cup : మరో 50రోజుల్లో వన్డే సమరం.. జట్టులో హైదరాబాదీకి ప్లేస్​​ డౌటే!

Rohit Sharma World Cup 2023 : 'అందరూ మా గురించే మాట్లాడుతున్నారు. అతన్ని అడగరేం'

Last Updated : Aug 21, 2023, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.