ట్రోలర్స్​కు దీటుగా సమాధానమిచ్చిన పాక్​ సారథి

author img

By

Published : Nov 25, 2021, 8:21 PM IST

babar azam reacts on trollers, ట్రోలర్స్​కు దీటుగా సమాధానమిచ్చిన పాక్​ సారథి బాబర్​ ఆజామ్​

Pakisthan Bangladesh test series: తన ఆటతీరుపై విమర్శించినవారికి గట్టి సమాధానమిచ్చాడు పాక్​ సారథి బాబర్​ ఆజామ్​. బంగ్లాదేశ్​తో జరగబోయే టెస్ట్​ సిరీస్​లో తమ జట్టు బాగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Babar azam form: 'నేను ప్రతిసారీ భారీగా పరుగులు సాధించాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా' అని పాకిస్థాన్​ జట్టు సారథి బాబర్​ ఆజామ్​ అన్నాడు. తనను విమర్శించిన వారిపై స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశాడు. టీ20 సిరీస్​లో బంగ్లాదేశ్​ను క్లీన్​స్వీప్​ చేసిన పాకిస్థాన్​ జట్టు నవంబరు 26(శుక్రవారం) ప్రారంభంకానున్న టెస్ట్​ సిరీస్​కు సిద్ధమైంది(Pakisthan Bangladesh test series). అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్​లో అద్భుతంగా ఆడిన బాబర్​.. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్​లో ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచుల్లో కలిపి కేవలం(7,1,19) మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు.. అతడి ఆటతీరును ట్రోల్​చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

"నేను ప్రతిసారీ భారీగా పరుగులు చేయాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా. టీ20 సిరీస్​లో తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం నా దృష్టి టెస్ట్​ సిరీస్​పైనే ఉంది. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది. కొంత కాలం నుంచి మేం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్​ ఆడుతున్నాం. వెంటనే టెస్ట్​ ఫార్మాట్​కు సిద్ధమవ్వడం సవాల్​ లాంటిది. టీ20 సిరీస్​ తర్వాత పూర్తిస్థాయిలో టెస్ట్​ మ్యాచ్​లకు సన్నద్ధమయ్యే సమయం దొరకలేదు. అయినా మా ఆటగాళ్లలో చాలా మందికి దేశవాళీ క్రికెట్​ ఆడిన అనుభవం ఉంది. బాగానే రాణిస్తాం." అని బాబర్​ అన్నాడు.

ఇదీ చూడండి: భారత్-పాక్ మ్యాచ్​కు రికార్డ్​ 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.