ETV Bharat / sports

కొత్త జట్లతో బేలిస్, ఫ్లవర్.. సన్​రైజర్స్​, పంజాబ్​కు గుడ్​బై!

author img

By

Published : Dec 2, 2021, 5:32 AM IST

Trevor Bayliss SRH: సన్​రైజర్స్ హైదరాబాద్​ కోచ్​ ట్రెవర్ బేలిస్ ఈ ఫ్రాంచైజీకి గుడ్​బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త జట్లయిన అహ్మదాబాద్, లఖ్​నవూలలో ఒక జట్టుకు ఇతడు కోచ్​గా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అలాగే పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్ రాజీనామా చేశారు.

Trevor Bayliss good bye to Sunrisers, Andy Flower good bye to punjab kings, ఆండీ ఫ్లవర్ పంజాబ్ కింగ్స్, ట్రెవర్ బేలిస్ సన్​రైజర్స్ హైజరాబాద్
బేలిస్

Trevor Bayliss SRH: సన్​రైజర్స్ హైదరాబాద్​ కోచ్ బాధ్యతల నుంచి ట్రెవర్ బేలిస్​ తప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్​లో కొత్తగా రాబోతున్న లఖ్​నవూ ఫ్రాంచైజీకి ఇతడు కోచింగ్ చేయబోతున్నాడని సమాచారం. అందుకోసమే సన్​రైజర్స్​కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్​సైట్ వెల్లడించింది.

2012, 14 సీజనల్లో బేలిస్ కోచింగ్ పర్యవేక్షణలోనే కోల్​కతా నైట్​రైడర్స్ విజేతగా నిలిచింది. అలాగే 2011-12 బిగ్​బాష్​ లీగ్​లో సిడ్నీ సిక్సర్స్​ను విన్నర్​గా నిలిపాడు. ​2019లో ఇంగ్లాండ్ జట్టు వన్డే ప్రపంచకప్​ గెలిచింది కూడా ఇతడి పర్యవేక్షణలోనే. ఆ తర్వాత సన్​రైజర్స్​కు కోచ్​గా బాధ్యతలు తీసుకున్నాడు బేలిస్.

పంజాబ్​కు ఆండీ ఫ్లవర్ గుడ్​బై

Andy Flower Punjab Kings: పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి ఆండీ ఫ్లవర్ తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. జట్టుతో రెండేళ్ల ఒప్పందం ముగిసినందున ఇతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కొత్త జట్ల(లఖ్​నవూ, అహ్మదాబాద్)తో ఫ్లవర్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'వేలంలో సీఎస్కే తీసుకోబోయే మొదటి ప్లేయర్ అతడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.