ETV Bharat / sports

ఐపీఎల్​ నుంచి జడేజా ఔట్​- కావాలనే తప్పించారా?

author img

By

Published : May 11, 2022, 10:44 PM IST

Updated : May 11, 2022, 10:56 PM IST

Jadeja ruled out of remainder of IPL, goes home with rib injury
ఐపీఎల్​ నుంచి జడేజా ఔట్​- కావాలనే తప్పించారా?

సూపర్ కింగ్స్​ మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా.. ఐపీఎల్​ నుంచి తప్పుకోడవంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే జడేజాను సీఎస్​కే యాజమాన్యం తప్పించినట్లు సోషల్​ మీడయాలో ప్రచారం జరుగుతోంది. ఇన్​స్టాలో జడేజాను సీఎస్​కే అన్​ఫాలో చేయడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఐపీఎల్ 15వ సీజన్​ నుంచి చెన్నై సూపర్ కింగ్స్​ మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా తప్పుకున్నాడు. అయితే జడేజా తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్కటెముక గాయం కారణంగా తదుపది మ్యాచ్​లకు జడేజా అందుబాటులో ఉండడని నిర్వాహకులు చెబుతున్నా.. ఆ ప్రకటనను క్రికెట్​ అభిమానులు నమ్మడం లేదు. సూపర్ కింగ్స్ యాజమాన్యం కావాలనే జడేజాను తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్​స్టాలో జడేజాను సీఎస్​కే అన్​ఫాలో చేయడమే ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Jadeja ruled out of remainder of IPL
ఐపీఎల్​ నుంచి జడేజా ఔట్

గాయం కారణంగానే దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆడలేదు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ.. జడేజా గాయపడ్డాడు. అయితే ఇందులో నిజం ఉండకపోవచ్చని.. కావాలనే.. జడేజాను సీఎస్​కే దూరం పెట్టిందనే వాదన సోషల్​ మీడియాలో చర్చ జరుగుతోంది.

కెప్టెన్​ అయ్యాక ఐపీఎల్ 2022లో జడేజా అంతగా రాణించలేకపోయాడు. కెప్టెన్సీ బాధ్యతలు మీద పడటం వల్ల ఒత్తిడికి గురైన జడ్డూ.. సరిగా ఆడలేదు. ఈ క్రమంలో వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకు 10 మ్యాచ్​లు ఆడిన జడేజా కేవలం 116 పరుగులు చేసి.. ఐదు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. జడేజా కెప్టెన్సీలో సీఎస్‌కే 8 మ్యాచ్‌లు ఆడగా.. రెండు మాత్రమే గెలిచింది. ఇప్పటికే సీఎస్‌కే స్టార్ పేసర్ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా.. సీజన్​కు దూరం కాగా.. రుతురాజ్‌ గైక్వాడ్, స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ.. కూడా గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమయ్యారు.

ఇదీ చదవండి: IPL 2022: అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!

Last Updated :May 11, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.