ETV Bharat / sports

2023 odi world cup : బీసీసీఐ అలా అనుకుంటే పొరపాటే.. కనీసం ఇకనైనా..!

author img

By

Published : Jul 31, 2023, 9:17 AM IST

2023 odi world cup : వన్డే ప్రపంచకప్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్​ఇండియాలో ప్రయోగాలు చేయడం అభిమానుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. బీసీసీఐ అలా చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ వివరాలు..

IND VS WI
IND VS WI 2023 : బీసీసీఐ అలా అనుకుంటే పొరపాటే.. కనీసం ఇకనైనా..!

IND VS WI 2023 : వెస్టిండీసే కదా! జింబాబ్వే, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ వంటి పసికూనలపై చిత్తుగా ఓడి వన్డే వరల్డ్​కప్​కు అర్హత సాధించలేకపోయింది. ఆ జట్టు ఏం చేస్తుందిలే అనుకున్నారా ఏమో.. ఇప్పుడు రెండో వన్డేలో ఆ జట్టు చేతిలో భంగపాటుకు గురయ్యారు. బ్యాటింగ్ , బౌలింగ్​లో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేశారంటూ విమర్శలను అందుకున్నారు. వన్డే ప్రపంచకప్‌ ఇంకా సమయం చాలు తక్కువగా ఉంది. మరి ఇలాంటి సమయంలో టీమ్​ ప్రదర్శన, వారి వ్యూహాలు భారత క్రికెట్​ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అసలీ మెగా టోర్నీ కోసం.. సన్నాహాలు పక్కా ప్రణాళిక పరంగానే సాగుతున్నాయా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

రెండు మ్యాచుల్లోనూ... తొలి వన్డేలో ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ మినహా.. పెద్దగా చెప్పుకోదగ్గ ఆటేమీ లేదు. కెప్టెన్ రోహిత్‌, కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్లో కిందకు దిగి మరీ.. ఇతర ఆటగాళ్లను పరీక్షించారు. కానీ 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు చాలా కష్టపడింది. ఇక రెండో వన్డేలో రోహిత్‌, కోహ్లీ రెస్ట్​తో దూరంగా ఉన్నారు. ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా ప్రశ్న మరింత దారుణంగా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ రెండిటిలోనూ విఫలైంది. ఈ రెండో మ్యాచ్​లో 90 పరుగుల వరకు ఒక్క వికెట్టూ కోల్పోలేదు. కానీ ఆ తర్వాత 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లను పోగొట్టుకుంది. వాళ్లంతో వరల్డ్ కప్​ జట్టు కోసం పరిశీలనలో ఉన్న ఆటగాళ్ల కావడం గమనార్హం. శాంసన్‌ (9), అక్షర్‌ (1), హార్దిక్‌ (7), సూర్యకుమార్‌ (24), జడేజా (10) అందరూ విఫలమైపోయారు. శార్దూల్‌ (3/42) తప్ప మిగతా బౌలర్లు తుస్సు మనిపించారు.

2023 odi world cup : 2021లోనూ ఇలానే.. వాస్తవానికి ఓ ప్రపంచకప్​ వస్తుందంటే.. రెండు, మూడేళ్ల ముందు నుంచే ఆయా జట్లు సన్నద్ధమవుతుంటాయి. ఓ రెండేళ్ల పాటు ప్రయోగాలు చేసి, ఆ తర్వాత తుది జట్టు తయారు చేస్తాయి. అలా ఏడాది ముందు నుంచే ఒకే జట్టును నిలకడగా ఆడిస్తూ వారిని ప్రపంచకప్​ బరిలోకి దింపుతాయి. కానీ టీమ్​ఇండియా అలా చేయట్లేదు. 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి చెత్త ప్రయోగాలే చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఏ మ్యాచ్‌లో ఏ ఆటగాడిని ఎందుకు ఆడించారో కూడా తెలియలేదు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దాని ఫలితం బోల్తా కొట్టింది. గ్రూప్​ దశలోనే ఇంటికి వెళ్లిపోయింది. అసలీ వరల్డ్​ కప్​(వన్డే, టీ20) హిస్టరీలోనే ఫస్ట్ టైమ్​ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలోనూ ఓడింది. సరే ఇంతటి నష్టం జరిగింది. అయినా ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకుని సరైన దారిలో వెళ్లాలి కదా? మళ్లీ అదే పాత పాట పాడుతోంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌లోనూ నిరాశే ఎదురైంది. కాబట్టి.. ప్రస్తుతం కాస్త ప్రయోగాలు తగ్గిస్తే మంచిది. లేదంటే రెండు చేతులు జేబులో పెట్టుకుని సైలైంట్​గా వెళ్లిపోవాల్సి వస్తుంది.

అలా అనుకుంటే పొరపాటే.. ప్రపంచకప్‌ ఎలాగో ఆడేది సొంతగడ్డపైనే కాబట్టి ప్రయోగాలతో ఏం ఇబ్బంది ఉండదులే అనకుంటే గుంతలో పడ్డట్టే. ఒకటి పోయినా ఇంకో మ్యాచ్​లో ఆడుదాం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్​ ఎంతో కీలకం. గట్టి బలమైన జట్టును దింపాల్సిందే. ఏ స్థానంలో ఏ ప్లేయర్​ను దింపాలి? ఓపెనర్లుగా ఎవరిని పంపాలి? మిడిలార్డర్‌లో ఎవరిని నిలబెట్టాలి? పేస్‌ బౌలింగ్​ను ఎవరు పంచుకుంటారు? స్పిన్‌తో రాణించేంది ఎవరు? అలా తుది జట్టుపై ఈపాటికే ఓ క్లారిటీ రావాలి. అలాంటిది ప్రయోగాలు అంటూ బోల్తా పడుతున్నారు. ఇంకా ఈ వరల్డ్ కప్​కు ముందు టీమ్​ఇండియా.. ఆసియా కప్‌లో 6 (అది ఫైనల్​కు వెళ్తే), ఆస్ట్రేలియాతో 3 వన్డేలు మాత్రమే అడుతుంది. కాబట్టి ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండి జట్టులో ఆటగాళ్లపై ఓ స్పష్టత తెచ్చుకోవాలి.

ఇదీ చూడండి :

Ind vs Wi Odi : బీసీసీఐపై ఫ్యాన్స్ గరం..'అప్పుడు జరిగింది చాలదా.. వాళ్లు లేకుండానే గెలుస్తారా'

IND VS WI 2023 : టీమ్‌ఇండియాకు భంగపాటు.. రెండో వన్డేలో విండీస్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.