ETV Bharat / sports

Ind vs Pak World Cup 2023 : దాయాదుల సమరంలో మనోళ్ల ఫన్నీ రియాక్షన్స్.. నెట్టింట ఇప్పుడు ఇవే ట్రెండ్.. మీరు చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 9:31 AM IST

Updated : Oct 15, 2023, 9:57 AM IST

Ind vs Pak World Cup 2023 : అహ్మదాబాద్​లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్​లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఈ ఫన్నీ రియాక్షన్స్​ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి మీరు ఆ వీడియోస్ చూశారా?

Ind vs Pak World Cup 2023
Ind vs Pak World Cup 2023

Ind vs Pak World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్​లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. దాయాదుల పోరులో జరిగిన ఈ సంఘటనలను మైదానంలో ప్రత్యక్షంగా, టీవీల్లో, ఓటీటీలో లైవ్ చూస్తున్న ప్రతీ టీమ్ఇండియా అభిమాని ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఎం జరిగిందంటే..

విరాట్ వాచ్ సీన్.. పాకిస్థాన్ ఇన్నింగ్స్​ 73 వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (36) ఔటయ్యాడు. తర్వాత మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్​కు రావాల్సి ఉంది. ఇక క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన రిజ్వాన్.. వచ్చి రాగానే బ్యాటింగ్​ చేయాల్సి ఉంది. కానీ అతడు నాన్ స్ట్రైక్​ఎండ్​లో ఉన్న కెప్టెన్ బాబర్ అజామ్​తో ఏదో ముచ్చటించాడు. సమయం గడుస్తున్నప్పటికీ.. రిజ్వాన్ మాటలు ఆపి బ్యాటింగ్​కు సిద్ధం కాలేదు. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు అసహనానికి లోనయ్యారు.

ఇక చేసేదేమీలేక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వెంటనే ఫీల్డ్​ అపైర్​ను సంప్రదించాడు. జరుగుతున్న ఆలస్యంపై అంపైర్​కు ఫిర్యాదు చేశాడు రోహిత్. మరోవైపు అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రిజ్వాన్​ను ఉద్దేశిస్తూ.. తన చేతికి ఉన్న బ్యాండ్​ను వాచ్​లాగా చూపిస్తు 'ఇంత ఆలస్యమా' అన్నట్లుగా రియాక్షన్​ ఇచ్చాడు. దీంతో విరాట్ యాక్షన్​కు.. మద్దతుగా వెంటనే ఆడియోన్స్​ కూడా గట్టిగా అరిచారు.

  • Some banter going on. Rizwan takes his time in marking his guard. Rohit has a word with the umpire.

    Virat Kohli looking at his imaginary watch. pic.twitter.com/2Dyk7U4Oco

    — Kevin (@imkevin149) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కండలు చూపిన రోహిత్ .. ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ.. పాక్ బౌలర్లలను ఓ ఆటఆడేసుకున్నాడు. ఏకంగా 136.51 స్ట్రైక్ రేట్​తో 86 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్​లో హిట్​మ్యాన్ 6 సిక్స్​లు బాదాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్ షహీన్ షా అఫ్రిదీ బౌలింగ్​లో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఇది మ్యాచ్​ మొత్తానికి హైలైట్​గా నిలిచింది.

అయితే రోహిత్.. మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదడాన్ని చూసి, ఆశ్చర్యపోవడం ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ వంత్తైంది. 'ఎలా ఇంత అలవోకగా సిక్స్​లు బాదుతున్నావ్' అని అంపైర్.. రోహిత్​ను అడిగాడు. దీంతో రోహిత్.. తన కండలు చూపించాడు. కండ బలంతోనే సిక్స్​లు బాదుతున్నానని నవ్వుతూ సరదాగా బదులిచ్చాడు. ఇక రోహిత్ తన కండలు చూపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  • Rohit Sharma showing his biceps to umpire after punishing Pakistan.

    How can someone hate this man !🥹 pic.twitter.com/9ZTD87VSEf

    — 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

India Vs Pakistan Match Viewership : హాట్​స్టార్​లోనూ రికార్డు కొట్టిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్​.. ఏకంకా 3.5 కోట్ల వ్యూస్!

ODI World Cup 2023 Ind Vs Pak : పాక్​పై భారత్​ విజయం.. కెప్టెన్స్​ రోహిత్​ - బాబర్​ ఏం అన్నారంటే?

Last Updated :Oct 15, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.