ETV Bharat / sports

ఈ సారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌ విజేతలు ఎవరంటే?

author img

By

Published : May 9, 2023, 3:53 PM IST

ICC Player Of The Month April 2023 : ప్రతి నెలా ఇచ్చే 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' ఆవార్డులను అంతర్జాతీయ క్రికెట్​ మండలి మంగళవారం ప్రకటించింది. ఆ వివరాలు..

ICC Player Of The Month April 2023
ICC Player Of The Month April 2023

ICC Player Of The Month April 2023 : ఇంటర్నేషనల్​ క్రికెట్ కౌన్సిల్​ (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్‌ విభాగంలో ఒకరికి 'ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డు'ను ప్రకటిస్తుంది. ఇటీవల న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసిన పాకిస్థాన్​ ప్లేయర్​ ఫఖర్​ జమాన్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ (ఏప్రిల్​) అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో థాయ్​లాండ్​ కెప్టెన్ నారుమోల్​ చా​వాయి​ అవార్డు గెలుచుకుంది. నవంబర్​ 2022 తర్వాత పాకిస్థాన్​ క్రికెటర్​​ ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటి సారి.

ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​గా అవార్డు పొందడంపై ఫఖర్​ స్పందించాడు. 'ఈ నెల నా కెరీర్​లో మరిచిపోలేనిది. రెండు వరుస సెంచరీలు సాధించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. అందులో నా ఫేవరెట్​ మాత్రం రావల్​పిండిలో 180 పరుగులు చేసి నాటౌట్​గా నిలవడం' అని చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజింలాండ్​తో రావల్​పిండి వేదికగా జరిగిన మొదటి వన్డే​లో న్యూజిలాండ్ విధించిన 289 టార్గెట్​ను ఛేదించి 5 వికెట్ల తేడాతో పాక్​ విజయం సాధించింది. ఇందులో ఫఖర్​ మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. 114 బంతుల్లో 117 పరుగులు బాదాడు. అదే వేదికలో జరిగిన రెండో మ్యాచ్​లోనూ ఫఖర్​ దంచికొట్టాడు. 144 బంతుల్లో 180* పరుగులు చేసి.. 337 భారీ టార్గెట్​తో బరిలోకి దిగిన పాకిస్థాన్​ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ICC Player Of The Month April 2023
ఫఖర్​ జమాన్​

ఇక, మహిళల విభాగంలో అవార్డు సాధించిన చవాయి.. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచింది. మూడు మ్యాచ్​ల సిరీస్​ను 3-0 తేడాతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి మ్యాచ్​లో 57 పరుగులు చేసి మెరిసింది. మూడో మ్యాచ్​లో మరో అర్ధ సెంచరీ నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన టీ20 సరీస్​లోనూ అదే ప్రదర్శన కనబరిచింది. దీంతో ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విషయమై స్పందించిన చవాయి.. ' వన్డేల్లో మరింత ముందుకెళ్లటానికి నాకు, నా జట్టుకు ఈ సిరీస్​లు ఎంతో కీలకమైనవి. ఈ విజయంతో చాలా మంది నన్ను గుర్తించారు. అది నాకు ఉత్సాహాన్ని కలిగించింది' అని చెప్పింది.

ICC Player Of The Month April 2023
నారుమోల్​ చావాయి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.