ETV Bharat / sports

ఆ ఒక్క పరుగు తీయనందుకు కివీస్​ ఆటగాడికి ఐసీసీ అవార్డు!

author img

By

Published : Feb 2, 2022, 5:57 PM IST

ICC Awards: లక్ష్య ఛేదనలో ప్రతి పరుగూ జట్టుకు కీలకమే. కానీ న్యూజిలాండ్​కు చెందిన ఆటగాడు ఆ సమయంలో ఒక పరుగు తీయబోయి వెనక్కు తగ్గాడు. ఈ చర్యకు అందరూ ప్రశంసలు కురింపించారు. అంతేకాదు.. ఐసీసీ అవార్డును కూడా బహుకరించింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ ఆటగాడు ఎవరు?

icc award
ఐసీసీ

ICC Awards: బౌలర్​కు అడ్డుపడ్డానని భావించి సులువైన పరుగు తీయకుండా వెనక్కు తగ్గాడు న్యూజిలాండ్​ ఆటగాడు డెరిల్​ మిచెల్​. ఈ ఘటన గతేడాది జరిగిన ఐసీసీ ప్రపంచకప్​లో జరిగింది. మిచెల్​ చర్యను అభినందిస్తూ తాజాగా ఐసీసీ 'స్పిరిట్​ ఆఫ్​ ది క్రికెట్​' అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు తనకు దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు మిచెల్.

icc award
డెరిల్​ మిచెల్​కు 'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్'​ అవార్డును ప్రకటించిన ఐసీసీ

ఇదీ జరిగింది..

అది టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​. గతేడాది నవంబరు 10 అబుదాబి వేదికగా న్యూజిలాండ్​-ఇంగ్లాండ్​ మధ్య హోరాహోరీగా మ్యాచ్​ జరుగుతోంది. లక్ష్య ఛేదనలో భాగంగా 17 ఓవర్లు పూర్తయిన సమయానికి కివీస్​ 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అదిల్​ రషీద్​ 18వ ఓవర్​ తొలిబంతిని​ వేశాడు. స్ట్రైక్​లో ఉన్న జేమ్స్​ నీషమ్​ లాంగ్​ ఆఫ్​వైపు బంతిని బాది పరుగుకు ప్రయత్నించాడు. అయితే బంతిని ఆపేందుకు బౌలర్​ రషీద్​ ప్రయత్నిస్తున్న క్రమంలో అనుకోకుండా మిచెల్​ అడ్డువచ్చాడు. దీంతో రషీద్​కు అడ్డుపడ్డానని భావించి నీషమ్​ను వెనక్కు వెళ్లమన్నాడు మిచెల్.

కానీ ఆ తర్వాత మిచెల్​-నీషమ్​ ద్వయం అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్ని అందించింది.

అందుకు గర్వపడుతున్నా

అవార్డు అందుకున్న నేపథ్యంలో అప్పటి ఘటనను గుర్తుచేస్తుకున్న మిచెల్​.. "మేము మ్యాచ్​ గెలిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. అలా అని క్రికెట్​లోని నైతిక విలువలను ఉల్లంఘించం. ఆ రోజు రషీద్​కు నేను అడ్డువచ్చానని అనిపించింది. అందుకే పరుగు తీయలేదు." అని చెప్పుకొచ్చాడు. ఈ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందని.. న్యూజిలాండర్లగా మేము గర్వపడుతున్నామని మిచెల్​ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : ICC T20 Rankings: కేఎల్ రాహుల్ ఓ స్థానంపైకి​.. కోహ్లీ, రోహిత్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.