ETV Bharat / sports

ఈ క్రెడిట్ మహీ భాయ్​దే- చెన్నై నన్ను నమ్మింది: దూబే

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 12:51 PM IST

Updated : Jan 15, 2024, 2:33 PM IST

Dube On Dhoni: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే, అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న సిరీస్​లో అదరగొడుతున్నాడు. అయితే ఈ క్రెడిట్ ధోనీ, సీఎస్​కే జట్టుకే చెందుతుందని దూబే పేర్కొన్నాడు.

Dube On Dhoni
Dube On Dhoni

Dube On Dhoni: ఆదివారం అఫ్గానిస్థాన్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ముందుగా బౌలింగ్​లో ఆకట్టుకున్న భారత్​ ఆపై ఛేజింగ్​లో అద్భుతంగా ఆడి 6 వికెట్ల తేడాతో మ్యాచ్ నెగ్గింది. అయితే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (68), శివమ్ దూబే (63*) బ్యాటింగ్ తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో ఈ మ్యాచ్​కు యశస్వి, దూబే హైలైట్​గా నిలిచారు. ఇక మ్యాచ్ అనంతరం తన క్రెడిట్ ధోనికే దక్కుతుందని దూబే అనగా, రోహిత్, విరాట్ తనకెంతో మద్దతుగా నిలిచారని యశస్వి గుర్తుచేసుకున్నాడు.

'ఈ క్రెడిట్ మహీ భాయ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దక్కుతుంది. నాలోని గేమ్​ను బయటకు తీసుకొచ్చి, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మహీ భాయ్. ఐపీఎల్​లో చెన్నై నాపై ఎంతో నమ్మకముంచింది. మేనేజ్​మెంట్ నన్ను ఎప్పుడు ప్రోత్సాహిస్తూ నేను అద్భుతంగా ఆడగలనని నమ్మింది' అని దూబే అన్నాడు.

'రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా నా ఇన్స్​ప్రెషన్. టెన్షన్ పడకుండా ఆడుకోమని రోహిత్ భయ్యా బ్యాటింగ్​కు ముందు చెప్పాడు. జట్టులో తన లాంటి సీనియర్ ఉండడం మంచిది. విరాట్ భయ్యతో కలసి ఆడడం ఎప్పుడు గొప్ప అనుభూతి ఇస్తుంది. అతడితో ఆడడం అదృష్టంగా భావిస్తా. ఈ పిచ్​పై ఎలాంటి షాట్స్ ఆడాలో భయ్యాతో డిస్కస్ చేశా' అని యశస్వి అన్నాడు.

  • Yashasvi Jaiswal talking about on his innings and playing with Virat Kohli and Rohit Sharma and learn from them.

    - King Kohli & The Hitman Rohit are Inspirations...!!!! pic.twitter.com/Ocop1g569U

    — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మ్యాచ్ విషయానికొస్తే: రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15. ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జైశ్వాల్ 68 పరుగులు, శివమ్ దూబే 63* హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కరీమ్ జనత్ 2, నవీన్ ఉల్ హక్, ఫారుకీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది

ఫ్లాష్​బ్యాక్ గుర్తుచేసిన విరాట్​- స్ట్రయిట్ డ్రైవ్​లో కోహ్లీయే 'కింగ్'

యశస్వి, దూబే ధనాధన్ ఇన్నింగ్స్- రెండో టీ20లో భారత్ విజయం

Last Updated : Jan 15, 2024, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.