ETV Bharat / sports

బీసీసీఐకి మళ్లీ కాసుల పంట.. ఏకంగా రూ.9424 కోట్లు!

author img

By

Published : May 11, 2023, 7:09 AM IST

Updated : May 11, 2023, 7:50 AM IST

ఇప్పటికే ఆదాయంలో ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండనుంది. ఆ వివరాలు...

BCCI earn 9424 crores
బీసీసీఐకి మళ్లీ కాసుల పంట.. ఏకంగా రూ.9424 కోట్లు!

Richest cricket board : ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు అంటే ఏది అనగానే.. టక్కున ఏం ఆలోచించకుండా చెప్పే పేరు బీసీసీఐ. ఒక్క ఏడాదికే ఎన్నో వేల కోట్లను ఆర్జిస్తూ.. వరల్డ్​ క్రికెట్‌లో అతి సంపన్నమైన బోర్డుగా పేరు పొందింది. అందుకే మన బోర్డు ప్రపంచ క్రికెట్​ను శాసిస్తోంది. అలాగే మిగతా బోర్డులు, జట్లపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తోంది! ముఖ్యంగా ఐపీఎల్ విజయవంతం కావడం వల్ల బీసీసీఐ ఖజానా ప్రతి ఏటా భారీగా నిండుతూనే వస్తోంది. దీంతో రెవెన్యూ పరంగా మిగతా బోర్డులు.. బీసీసీఐకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసీసీకి భారత్ జట్టు లేకపోతే ఆదాయం లేనట్టే! అయితే ఈ ఆదాయం విషయంలో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి.. ఇప్పుడు మరోసారి కాసుల పంట పండనుందని తెలుస్తోంది.

Bcci revenue 2023 to 2027 : ఐసీసీ నుంచి ఆదాయంలో.. 2023 నుంచి 2027 వరకు అయిదేళ్ల కాలానికి గాను సుమారు రూ.9424 కోట్లను వాటాగా బీసీసీఐ పొందనుందట. ఈ ఐదేళ్లకు ఐసీసీ ఆదాయం(ICC Revenue) సుమారు రూ.24 వేల కోట్లు( ఉంటుందని అంచనా. అంటే అందులో దాదాపు 38.50 శాతం బీసీసీఐ ఖాతాలో చేరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని తెలిసింది. ఈ విషయాన్ని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపారు.

జైషా అధ్యక్షుడిగా ఉండటం వల్లే.. ఇకపోతే ఏడాదికి ఐసీసీకి ఆదాయం రూ.4918 కోట్లు రానుందని అంచనా ఐసీసీ సభ్యుడు పేర్కొన్నారు. క్రికెట్​లో ర్యాంకింగ్‌, ఆటకు వాణిజ్య సహకారం, ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని.. కొత్త ఆర్థిక విధానం ప్రకారం ఆదాయంలో సభ్య దేశాలకు వాటా ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. ఇంగ్లాండ్‌కు 6.89 శాతం, ఆస్ట్రేలియాకు 6.25 శాతం, పాకిస్థాన్‌కు 5.75 శాతం ఆదాయంలో వాటా దక్కే ఛాన్స్ ఉంటుంది. చివరిసారి 2018 నుంచి 2022 వరకు ఐసీసీ నుంచి 26 శాతం వాటాను పొందింది బీసీసీఐ. కానీ ఇప్పుడు ఐసీసీలో శక్తిమంతమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల విభాగానికి(ఫైనాన్స్​ అండ్ కమర్షియల్ అఫైర్స్​) బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షుడిగా ఉండడం వల్ల.. ఈ సారి ఆదాయంలో మన వాటా పెరగబోతుందని సమాచారం అందింది.

ఇదీ చూడండి: ధోనీ మెరుపులు.. ప్లేఆఫ్స్‌ దిశగా సీఎస్కే.. దిల్లీపై విజయం

Last Updated : May 11, 2023, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.