కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్ మృతి

కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్ మృతి
Australia cricketer Andrew symonds died: ఆస్ట్రేలియా క్రికెట్లో షేన్ వార్న్ మరణం మరవకముందే మరో దిగ్గజ క్రికెటర్ మృతిచెందాడు. మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) ఓ కారు ప్రమాదంలో మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
Australia cricketer Andrew symonds died: ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం జరిగింది. దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) మరణించాడు. క్వీన్స్‌లాండ్‌లోని అలైస్ రివర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెర్వే రేంజ్ రోడ్లో జరిగిన కారు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 10.30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
ఇటీవలే ఆసీస్ ప్లేయర్స్ రాడ్ మార్ష్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూయగా.. ఇప్పుడు సైమండ్స్ మరణించడంతో ఆసీస్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. అతడి మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కెరీర్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన సైమండ్స్.. మొత్తంగా 26టెస్టులు(1462 పరుగులు, 24 వికెట్లు), 198 వన్డేలు(5088, 133), 14 టీ20లు(337, 8), 39 ఐపీఎల్(974, 20) మ్యాచులు ఆడాడు. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అతడు 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి: రాయుడు ట్వీట్‌తో గందరగోళం.. సీఎస్కే క్లారిటీ
