ETV Bharat / sports

Asia Cup 2023 India VS Nepal : వర్షం కారణంగా మ్యాచ్​ రద్దైతే పరిస్థితేంటి?.. సూపర్​-4కు ఎవరెళ్తారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 5:22 PM IST

Asia Cup 2023 Rain update India VS Nepal : ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా జరగనున్న మ్యాచ్​లో భారత్, నేపాల్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​పై కూడా వర్షం ప్రభావం కనిపిస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా రద్దైతే పరిస్థితేంటి?

Asia Cup 2023 India VS Nepal :  వర్షం కారణంగా రద్దైతే.. సూపర్​-4కు ఎవరెళ్తారు? పరిస్థితి ఏంటి?
Asia Cup 2023 India VS Nepal : వర్షం కారణంగా రద్దైతే.. సూపర్​-4కు ఎవరెళ్తారు? పరిస్థితి ఏంటి?

Asia Cup 2023 Rain Update India VS Nepal : ఆసియా కప్​ను వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీమ్‌ ఇండియా మ్యాచ్‌ ఒకటి వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడుతోంది. ఈ మ్యాచ్​ పూర్తిగా జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 4 పరిస్థితి ఏంటి? అనే చర్చ తెగ సాగుతోంది. నేపాల్‌ మ్యాచ్‌ కూడా ఇప్పుడు వర్షం కారణంగా రద్దైపోతే ఎవరు సూపర్‌-4లోకి ఎంట్రీ ఇస్తారు? తెలుసుకుందాం..

Asia Cup 2023 Super 4 Matches : చిరకాల ప్రత్యర్థులు టీమ్​ఇండియా - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. అయితే అప్పటికే నేపాల్‌పై సూపర్ విక్టరీ సాధించిన పాకిస్థాన్​.. సూపర్‌ 4లోకి అడుగుపెట్టింది. మరోవైపు సోమవారం(సెప్టెంబర్ 4) అదే పల్లెకెలె వేదికగా నేపాల్‌తో టీమ్​ఇండియా (India vs Nepal) మ్యాచ్‌ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌పై కూడా వరుణుడి ప్రభావం పడుతోంది. ఇప్పటికే మైదానం ఓ వైపు అంతా మేఘావృతం అయింది. వర్షపు జల్లులు కూడా పడ్డాయి. పిచ్​పై కవర్లు కప్పి తీశారు.

INDIA VS NEPAL : అయితే ఈ నేపాల్​తో జరిగే మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైతే.. ఇరుజట్లకు చెరో పాయింట్‌ దక్కుతుంది. అప్పుడు టీమ్‌ఇండియా 2 పాయింట్లతో నేపాల్‌ కన్నా ముందుంటుంది. దీంతో భారతే సూపర్‌ 4లోకి ఎంట్రీ ఇస్తుంది. అంటే గ్రూప్‌ ఏ నుంచి టీమ్​ఇండియా-పాకిస్థాన్​ సూపర్‌ 4కు చేరుకున్న జట్లుగా నిలుస్తాయి. ఒకవేళ నేపాల్‌ సూపర్‌ 4కు వెళ్లాలని ఆశిస్తే.. టీమ్​ఇండియాపై తప్పనిసరిగా విజయాన్ని అందుకోవాలి. అదే సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కూడా ఉండకూడదు.

దీంతో మ్యాచ్‌ సజావుగా సాగాలని నేపాల్​ క్రికెట్​ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పసికూన నేపాల్‌పై టీమ్‌ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేపాల్ ఓడితే.. ఇంటిబాట పట్టాల్సిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ వరుణుడు సొంతమవుతుందో? లేదా ఎవరు గెలిచి సూపర్ 4కు ఎంట్రీ ఇస్తారో?

  • The first ever ODI between Nepal and Pakistan is set to be a memorable clash, especially for the Nepalese cricket team. A proud moment for them to make their Asia Cup debut against one of the most prominent teams in world cricket. 👏#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/BXXX16EYxP

    — AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే

Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?

Asia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీAsia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.