ETV Bharat / sitara

'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'

author img

By

Published : Dec 21, 2021, 10:12 AM IST

Thaman at Alitho Saradaga: బయట కంటే ఇంట్లోనే తనను ఎక్కువగా ట్రోల్ చేస్తారని అన్నారు సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ తమన్​. ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతడు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా' షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై జరిగే ట్రోలింగ్​ సహా వ్యక్తిగత జీవితం గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ss thaman
తమన్

Thaman at Alitho Saradaga: ఇటీవలే వచ్చిన నందమూరి బాలకృష్ణ 'అఖండ'కు దద్దరిల్లే మ్యూజిక్ అందించి ప్రేక్షకుల మన్ననలు పొందారు సంగీత దర్శకుడు తమన్. సినిమాకు బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో పెద్ద అసెట్​గా నిలిచారు. దీంతో తమన్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాకు నప్పేలా, దర్శకుడు కోరిన విధంగా అద్భుతమైన సంగీతం అందించే తమన్​.. ట్యూన్లు కాపీ చేస్తాడంటూ గతంలో ట్రోల్స్​ వచ్చేవి. వీటిపై ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో స్పందించారు తమన్. మీమర్స్​ కన్నా ఎక్కువగా తన తల్లే తనను ట్రోల్​ చేస్తుందని చెప్పారు​.

ss thaman
ఎస్​ఎస్​ తమన్

"ఇంట్లోనే నాపై బాగా ట్రోలింగ్​ జరిగిపోతుంది. కాబట్టి బయట ట్రోలింగ్​ను పెద్దగా పట్టించుకోను. మా అమ్మ అయితే.. ఏంట్రా ఆ పాట అంటూ.. పప్పులో ఉప్పు తక్కువగా వేయడం లాంటివి చేస్తుంది (నవ్వుతూ). ఆమెతో పోలిస్తే మీమర్స్​ చేసే ట్రోలింగ్ తక్కువే."

- ఎస్​ఎస్​ తమన్, సంగీత దర్శకుడు

ss thaman
తల్లితో తమన్

బాలీవుడ్​లో అందుకే సెటిల్​ అవ్వలేదు..

తాను ఆరో తరగతి వరకే చదువుకున్నట్లు చెప్పారు తమన్. బాలీవుడ్​ సినిమాకు మ్యూజిక్​ అంటే పెళ్లి ఒకరితో ఫస్ట్​ నైట్​ ఇంకొకరితో అన్నట్లు ఉంటుందని తెలిపారు. అందుకే అక్కడ సెటిల్​ అవ్వలేకపోయినట్లు వివరించారు. ఇక తన బ్లడ్​లో ఇళయరాజా వైరస్​ ఎక్కువగా ఉందని చమత్కరించారు. వీటితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు తమన్. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్​ 27న ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వరుస సినిమాలతో..

తమన్ సంగీతం అందించిన 'భీమ్లా నాయక్'​​ ఈ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సూపర్​స్టార్​ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట', వరుణ్ తేజ్​ 'గని', అఖిల్​ 'ఏజెంట్​' సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్​.​ శంకర్​ దర్శకత్వంలో రామ్​ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

'అఖండ' మ్యూజిక్.. సౌండ్​ బాక్సులు పగిలిపోతాయి!

'అరవింద సమేతలోని ఆ పాట కోసం చాలా కష్టపడ్డా.. కానీ!'

'ప్రభాస్​తో అందుకే కుదరలేదు.. త్వరలోనే కలిసి పనిచేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.