ETV Bharat / sitara

రూ.4కోట్ల రెమ్యునరేషన్​ తిరిగిచ్చిన నవీన్​ పొలిశెట్టి!

author img

By

Published : Sep 2, 2021, 3:10 PM IST

సితార ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​లో వచ్చిన ఆఫర్​ను హీరో నవీన్​ పొలిశెట్టి వదులుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం తీసుకున్న రూ. 4కోట్ల అడ్వాన్స్​ కూడా తిరిగి ఇచ్చేశాడట. కారణం ఏంటంటే?

naveen polishetty
నవీన్​ పొలిశెట్టి

తొలి చిత్రం 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో కామెడీ డిటెక్టివ్‌గా అందర్నీ మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పొలిశెట్టి. ఇటీవల 'జాతిరత్నాలు'తో(jathi ratnalu naveen polishetty) ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఈ క్రమంలో అతడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అనుష్కతో ఓ సినిమాతో(anushka naveen polishetty movie) పాటు సితార ఎంటర్​టైన్​మెంట్(రూ. 4కోట్ల పారితోషికం)​, యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో ఓ సినిమాకు ఓకే చేసి అందుకు అడ్వాన్స్​ కూడా తీసుకున్నాడని తెలిసింది.

అయితే ఇప్పుడు సితార ఎంటర్​టైన్​మెంట్స్​ ఆఫర్​ను వదులుకున్నాడట. తీసుకున్న​ రూ.4కోట్ల పారితోషికం తిరిగి ఇచ్చేశాడని సమాచారం. రంగ్​దే మూవీ కో డైరెక్టర్​ కథ వినిపించగా నవీన్​ స్క్రిప్ట్​లో కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికీ కథ పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్​ను పక్కన పెట్టి, డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: దీపిక పేరుతో కిన్వా వ్యాపారం చేశా: నవీన్​ పొలిశెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.