ETV Bharat / sitara

శివరాత్రి స్పెషల్​.. 'భోళాశంకర్'​ స్పెషల్​ వీడియో రిలీజ్​

author img

By

Published : Mar 1, 2022, 9:27 AM IST

chiranjeevi bholashankar update: శివరాత్రి సందర్భంగా భోళాశంకర్​ చిత్రబృందం కొత్త అప్డేట్​ను ఇచ్చింది. 'వైబ్‌ ఆఫ్‌ భోళా' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇది ఆకట్టుకునేలా ఉంది.

చిరు భోళాశంకర్​
చిరంజీవి భోళాశంకర్​

chiranjeevi bholashankar update: మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాశివరాత్రి కానుక వచ్చేసింది. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. తమన్నా కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌నుమహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్‌ ఆఫ్‌ భోళా’ పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

"అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రఘుబాబు, రావు రమేష్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్నారు. డుడ్లీ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Prabhas Adipurush: ప్రభాస్​ 'ఆదిపురుష్'​ కొత్త రిలీజ్​ డేట్​ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.