ETV Bharat / sitara

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

author img

By

Published : Apr 16, 2021, 1:00 PM IST

Updated : Apr 16, 2021, 2:09 PM IST

తమిళ నటుడు వివేక్​ గుండెపోటుకు గురవ్వడం వల్ల శుక్రవారం ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. గురువారం కొవిడ్​ వాక్సిన్​ తీసుకున్న వివేక్​.. మూర్ఛవచ్చి పడిపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

Actor Vivek Hospitalized due to heart attack
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

ప్రముఖ తమిళ నటుడు వివేక్​ గుండెపోటుకు గురయ్యారు. గురువారం కొవిడ్​ వాక్సిన్ తీసుకున్న ఆయన మూర్ఛతో పడిపోవడం వల్ల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

Actor Vivek Hospitalized due to heart attack
గురువారం కొవిడ్​ వాక్సిన్​ తీసుకున్న వివేక్​

అయితే వివేక్​ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు. తమిళ చిత్రాల్లో రజనీకాంత్, విజయ్​, అజిత్​ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్​. సహాయక పాత్రలతో పాటు హాస్యనటుడిగానూ ఆయన మెప్పించారు.

ఇదీ చూడండి: 'సెహరి' టీజర్​.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్​

Last Updated : Apr 16, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.