ETV Bharat / science-and-technology

వాట్సాప్‌లో 65,536 నంబర్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా?

author img

By

Published : Jan 16, 2023, 12:20 PM IST

limit of letters limit in whatsapp message news
వాట్సాప్‌లో 65536 నంబర్‌ ప్రత్యేకత

యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్‌ ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువైన ఈ యాప్‌లో కొన్ని ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. అవేంటో చూద్దామా.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి యూజర్‌ తప్పనిసరిగా వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ను వాడుతుంటారు. సాధారణ ఫోన్‌ కాల్‌, మెసేజింగ్‌ తర్వాత చాట్‌, మీడియా ఫైల్‌ షేరింగ్‌ అనగానే ఎక్కువ మంది ఎంపిక వాట్సాప్‌. సరదా సంభాషణల నుంచి బోర్డ్‌రూమ్‌ మీటింగ్‌ల వరకు ఎన్నో వాట్సాప్‌ ద్వారా జరిగిపోతున్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన వాట్సాప్‌లో 65,536 నంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

వాట్సాప్‌లో పంపే ప్రతి మీడియా ఫైల్‌కు పరిమితి ఉంటుంది. అంటే టెక్ట్స్‌, ఫొటో, వీడియో/ఆడియో, డాక్యుమెంట్.. ఇలా ఏది షేర్‌ చేయాలన్నా నిర్ధిష్ట సైజుకు మించి పంపలేం. అలానే వాట్సాప్‌లో 65,536 అక్షరాలకు మించి ఇతరులకు పంపడం సాధ్యంకాదు. ఒకవేళ మీరు 65,537 అక్షరాలు టైప్‌ చేసి పంపాలని ప్రయత్నిస్తే.. పాప్‌-అప్‌ స్క్రీన్‌పై మొదటి 65,536 అక్షరాలు మాత్రమే పంపబడతాయి అని కనిపిస్తుంది.

ఇతర మీడియా ఫైల్స్‌ పరిమితులు ఇలా..

  • వాట్సాప్‌లో ఒకేసారి 30 ఫొటోల వరకు పంపొచ్చు. అంతకు మించి ఫొటోలు అటాచ్‌ చేసి పంపాలని ప్రయత్నించినా వాట్సాప్‌ స్క్రీన్‌పై పాప్‌-అప్‌ విండో ద్వారా పంపడం సాధ్యపడదని తెలియచేస్తుంది.
  • వీడియోలు కూడా ఒకేసారి 30కు మించి పంపలేం. అయితే, ప్రతి వీడియో ఫైల్ కచ్చితంగా 16 ఎంబీ సైజుకు మించి ఉండకూడదు. వాట్సాప్‌లోని కెమెరా ఆప్షన్‌ ద్వారా రికార్డు చేసిన వీడియో సైతం 16 ఎంబీ సైజుకు మించి ఉండకూడదు.
  • డాక్యుమెంట్స్‌ విషయానికొస్తే.. గతంలో కేవలం 100 ఎంబీ సైజు ఉన్న వాటిని వాట్సాప్‌ ద్వారా ఇతరులతో షేర్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవలే వాట్సాప్‌ ఫైల్‌ సైజ్‌ను పెంచింది. దీంతో యూజర్లు 2 జీబీ సైజ్‌ ఉన్న డాక్యుమెంట్లను కూడా వాట్సాప్‌ ద్వారా పంపొచ్చు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.