ETV Bharat / science-and-technology

UPSC సివిల్స్ పరీక్షలో చాట్​జీపీటీ ఫెయిల్.. ఎన్ని మార్కులు వచ్చాయంటే?

author img

By

Published : Mar 4, 2023, 12:16 PM IST

chatgpt-failed-upsc-prelims
చాట్​ జీపీటీ యూపీఎస్​సీ

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలుగా భావించే ఎం​బీఏ, అమెరికా మెడికల్​, లా ఎగ్జామ్​లలో పాస్​ అయిన చాట్​జీపీటీ.. యూపీఎస్​ పరీక్షల్లో మాత్రం ఫెయిల్​ అయింది. సివిల్ సర్వెంట్ల నియామకానికి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత మార్కులకంటే తక్కువే తెచ్చుకుంది.

ఓపెన్​ ఏఐ సంస్థకు చెందిన ప్రముఖ చాట్​బాట్​ 'చాట్​జీపీటీ'.. యూపీఎస్​సీ పరీక్షలో ఫెయిల్​ అయింది. ఈ పరీక్షల్లో కేవలం 54 మార్కులే సాధించింది. ప్రపంచంలో అతి కఠినతరమైన పరీక్షలుగా భావించే కొన్నింటిని.. చాట్​జీపీటీ గతంలో సులువుగా పాస్ అయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ ఎం​బీఏ పరీక్ష, అమెరికా మెడికల్​, లా ఎగ్జామ్​లలోనూ ఉత్తీర్ణత సాధించింది.​ కానీ భారత్​లో సివిల్ సర్వెంట్ల నియమకానికి నిర్వహించే పరీక్షల్లో మాత్రం ఫెయిల్​ అయింది.

తాజాగా అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ (ఏఈఎం​) అనే సంస్థ.. చాట్​జీపీటీకి సివిల్స్ పరీక్ష నిర్వహించింది. ముందుగా "యూపీఎస్​ ప్రిలిమినరీ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవుతారని అనుకుంటున్నారా?" అని ఏఈఎమ్​.. చాట్​జీపీటీని ప్రశ్నించింది. "అది కష్టంగానే ఉంటుందని తెలుసు. నేను ఈ పరీక్ష పాస్​ అవుతానో లేదో కచ్చితంగా చెప్పలేను" అని చాట్​జీపీటీ బదులిచ్చింది. దీంతో పరీక్షలో భాగంగా చాట్​జీపీటీకి 100 ప్రశ్నలు సంధించింది ఏఈఎం. 2022 యూపీఎస్​సీ ప్రిలిమ్స్​.. క్వశ్చన్​ పేపర్​ 1(సెట్​ ఏ) నుంచి వీటిని అడిగింది. ఇందులో కొన్ని ప్రశ్నలకు మాత్రమే చాట్​జీపీటీ సరైన సమాధానాలు చెప్పగలిగింది. ఈ పరీక్షల్లో జనరల్​ కేటగిరీ అభ్యర్థులకు కట్​ఆఫ్​ మార్కులు 87.54 కాగా.. చాట్​జీపీటీ ఇందులో 54 మార్కలు మాత్రమే సాధించి ఫెయిల్​ అయింది.

చాట్​జీపీటీకి ​2021 సెప్టెంబర్​ క్రితం జరిగిన విషయాలే తెలుసు. కాబట్టి అది చాలా వరకు భారత కరెంట్​ ఎఫైర్స్​కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. అయితే భూగోళశాస్త్రం, చరిత్ర, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు కూడా చాట్​జీపీటీ సమాధానం చెప్పలేదు. కొన్ని మల్టిపుల్​ చాయిస్​ ప్రశ్నలకు.. పైవేవీ కాదు అనే సమాధానం కూడా ఇచ్చింది. ప్రశ్నలలో ఆ ఆప్షన్​ లేనప్పటికీ.. ఈ సమాధానమిచ్చింది.

యూపీఎస్​ పరీక్షని ప్రపంచంలోనే​ చాలా కఠినమైనదిగా పరిగణిస్తారు. సంవత్సరానికి దాదాపు 11, 12 లక్షల మంది ఈ పరీక్షను రాస్తారు. కానీ 5 శాతం మంది మాత్రమే మెయిన్స్​కు ఉత్తీర్ణత సాధిస్తారు. కేస్ స్టడీస్‌పై ఆధారపడిన వాటితో సహా బేసిక్​ ఆపరేషన్​ మేనేజ్​మెంట్​, ప్రాసెస్​ అనాలిసిస్​ క్వశ్చన్​పై చాట్‌బాట్ జీపీటీ.. మంచి ప్రదర్శన కనబర్చిందని ప్రొఫెసర్ క్రిస్టియన్ టెర్వీష్ తెలిపారు. ఇందులో చాట్‌జిపిటి బి నుంచి బి-గ్రేడ్‌ను పొందుతుందన్నారు. అమెరికాకు చెందిన 'ఓపెన్‌ఏఐ' అనే సంస్థ.. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ 'చాట్‌ జీపీటీ' సృష్టించింది. 2022 నవంబరు 30న దీన్ని విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.