ETV Bharat / science-and-technology

200% ఫాంట్​ సైజ్​.. స్క్రీన్​ ఫ్లాష్​ నోటిఫికేషన్.. సూపర్​ ఫీచర్స్​తో 'ఆండ్రాయిడ్​ 14' రెడీ​!

author img

By

Published : Aug 11, 2023, 7:27 PM IST

Android New Version : అతిత్వరలో ఆండ్రాయిండ్​ 14 సాఫ్ట్​వేర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ప్రముఖ సంస్థ గూగుల్​. పిక్సెల్​, శాంసంగ్ సహా ఇతర ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లలో ఈ ఓఎస్​ను అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో మీ స్మార్ట్​ఫోన్​కు శాటిలైట్​ కనెక్టివిటీతో పాటు మరింత భద్రతను కల్పించుకోవచ్చని వివరించింది.

Android New Version Name14 Beta 5
Google Android 14 Software

Android New Version : ప్రముఖ సంస్థ గూగుల్​ మొబైల్​ వినియోగదారులకు గుడ్​న్యూస్ చెప్పింది. అతిత్వరలో ఆండ్రాయిండ్​ 14(Android 14 Beta 5) స్టేబుల్ ఆపరేటింగ్​ సిస్టమ్​(ఓఎస్​)ను ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ ఇప్పటికే ఫైనల్​ ప్రీ-రిలీజ్ బిల్డ్ అయిన బీటా 5ను రిలీజ్​ చేసింది.

ఈ ఆవిష్కరణతో గూగుల్..​ సాఫ్ట్​వేర్​ రంగంలో అతిపెద్ద సంస్కరణకు అడుగు వేసినట్లయింది. ఈ వెర్షన్​లో SDK, NDK APIలు, వీటితో పాటు సిస్టమ్​ బిహేవియర్స్​ ఉన్నాయి. వీటి పనితీరును తెలుసుకునేందుకు ఔత్సాహికుల నుంచి ఫీడ్​బ్యాక్​ను స్వీకరిస్తోంది. అలా వచ్చిన అభిప్రాయాల ద్వారా ఆండ్రాయిడ్ 14 ఫైనల్ వెర్షన్​ ఓఎస్​ను గూగుల్​ విడుదల చేయనుంది. ఫీడ్​బ్యాక్​ గనుక పాజిటివ్​గా వస్తే డెవలపర్లు రానున్న కొత్త ఓఎస్​లో తమ అప్లికేషన్​లు సపోర్ట్​ చేసేలా వాటిని రూపొందించుకోవాలని సూచించింది.

బీటా 5 వెర్షన్​ను తెచ్చేందుకు గత నెలలోనే 4.1 బీటా వెర్షన్​లోని అనేక బగ్స్​ను ఫిక్స్ చేసి, ఆప్టిమైజ్ చేసింది గూగుల్​. ఈ వెర్షన్​తో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్​ పెరగనుంది. రిలీజ్ క్యాండిడేట్ పేరుతో ఫైనల్ బీటా అప్డేట్స్​ను కూడా లాంఛ్ చేసింది. దీంతో ఫిక్స్​డ్​ లేదా స్టేబుల్​ స్టేటస్​కు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. మొత్తంగా త్వరలో అందుబాటులో(Android 14 Release Date)కి రానున్న ఈ నయా సాఫ్ట్​వేర్​ను గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్​ ట్యాబ్లెట్​ సహా కంపాటిబుల్ పిక్సెల్ డివైజ్​ యూజర్లు ఆస్వాదించవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఓఎస్​తో రానున్న కీలక ఫీచర్లివే..

మరింత మెరుగ్గా బ్యాటరీ లైఫ్..
Android New Update : గూగుల్​ తీసుకురానున్న ఈ ఆండ్రాయిడ్ 14 ఓఎస్​తో స్మార్ట్​ ఫోన్ల్ బ్యాటరీ లైఫ్​ మరింతగా మెరుగుపడనుంది. దీంతో విద్యుత్​ వాడకం కూడా తగ్గనుంది. బ్యాక్​గ్రౌండ్ టాస్క్ మేనేజ్​మెంట్, అప్లోడ్స్​, డౌన్లోడ్స్​ వంటి యాక్షన్స్​ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫలితంగా బ్యాటరీ లైఫ్​స్పాన్ పెరుగుతుంది.

200% సైజులో ఫాంట్​..
Android 14 Features : రానున్న ఈ కొత్త సాఫ్ట్​వేర్​(Android 14)తో మీ ఫోన్​లో ఫాంట్​ సైజ్​ను 200 శాతం వరకు పెంచుకోవచ్చు. ఇది చిన్న అక్షరాలను చూసేందుకు ఇబ్బంది పడేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

స్క్రీన్​ ఫ్లాష్​ నోటిఫికేషన్​..
Google Android 14 Features : ఈ వెర్షన్​ ద్వారా వచ్చే కొత్త ఫీచర్లలో ఆకట్టుకునేది స్క్రీన్​ ఫ్లాష్​ నోటిఫికేషన్​. అంటే మీ మొబైల్​కు ఏవైనా నోటిఫికేషన్​లు వచ్చినప్పుడు మీ కెమెరా స్క్రీన్​ ఫ్లాష్​ అవుతుంది. వినికిడి సమస్యతో బాధపడే వారికి ఈ ఫీచర్​ బాగా దోహదపడుతుంది.

డెవలపర్లకు మరింత చేరువగా..
Android New Features For Developers : ప్రీమియం ఫోన్​ యాపిల్​లో లాగా అన్ని స్క్రీన్​ పరిమాణాలకు యాప్స్​ రూపొందించడం, టూల్స్​ను అభివృద్ధి చేయడం వంటి సూపర్​ ఆప్షన్​లు డెవలపర్లకు అందుబాటులో ఉండనున్నాయి.

మీడియా ఫైల్స్​కు ప్రైవసీ..
Android 14 New Features : ఆండ్రాయిడ్ 14 ఓఎస్​(Android New Version Name) ద్వారా మీ స్మార్ట్​ఫోన్​లలో ఓ గొప్ప ఫీచర్​ రానుంది. అదే మీడియా యాక్సెస్​. దీంతో సదరు యాప్స్​కు ఫొటోలు, వీడియోల యాక్సెస్​ను పరిమిత సంఖ్యలో ఇవ్వచ్చు. అంటే మీకు కావాల్సిన ఫొటో లేదా వీడియోను మాత్రమే యాక్సెస్​ చేసేందుకు ఆయా యాప్స్​కు పర్మిషన్స్​ ఇవ్వచ్చు. అప్పుడు మీ గ్యాలరీలోని మిగతా ఫొటోలు, వీడియోలను యాప్స్ యాక్సెస్ చేయలేవు. దీంతో యూజర్ల ప్రైవసీ మరింత పెరగనుంది.

మొబైల్​ నెట్​వర్క్​ లేకున్నా..
Android 14 Beta 5 Features : ఆండ్రాయిడ్ 14తో శాటిలైట్ కనెక్టివిటీ అనే నయా ఫీచర్​ను కూడా మీ స్మార్ట్​ఫోన్లలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని సందర్భాల్లో మొబైల్ నెట్​వర్క్ సేవలు అందుబాటులో లేనివారికి శాటిలైట్​ ద్వారా సేవలు పొందేందుకు ఈ ఫీచర్​ ఉపయోగపడుతుందని గూగుల్​ పేర్కొంది. అంతేకాకుండా మున్ముందు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను కూడా పొందవచ్చని తెలిపింది.
మొత్తంగా ఆండ్రాయిడ్ 14 వెర్షన్ సాయంతో పైన తెలిపిన ఫీచర్లే కాకుండా మరికొన్ని ఫీచర్లను కూడా రూపొందిస్తున్నట్లు గూగుల్ చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.