ETV Bharat / jagte-raho

మహిళా అధికారికి 'దిశ' అండ.. సిబ్బందికి సీఎం అభినందన

author img

By

Published : Feb 11, 2020, 4:37 PM IST

Updated : Feb 11, 2020, 7:43 PM IST

దిశ యాప్​తో ఓ మహిళా అధికారికి సత్వర సాయం అందింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సులో ఓ మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ సాయం కోసం దిశ యాప్​ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకుని ఆమెను రక్షించారు.

respons to disha app
దిశ యాప్​కు స్పందన

'దిశ' యాప్‌ ద్వారా మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సులో ఓ మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ సహాయం కోసం తెల్లవారుజమున 4 గంటల సమయంలో దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.

ఎస్​వోఎస్​ కాల్​

యాప్​లో ఎస్​వోఎస్​ కాల్​ ద్వారా ఉదయం 4.21 గంటలకు మంగళగిరి దిశ కాల్​ సెంటర్​కు సమాచారం అందింది. దగ్గర్లోని ఎమెర్జెన్సీ టీంకు సిబ్బంది సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 6 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకుని మహిళను రక్షించారు. అతన్ని ఏలూరు మూడో పట్టణ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు. ఈ కేసు పెదపాడు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో నిందితుణ్ని అక్కడికి తరలించారు.

సీఎం అభినందన

దిశ యాప్‌ ద్వారా మహిళా అధికారికి అండగా నిలిచిన ఈ కేసును డీజీపీ ముఖ్యమంత్రి జగన్​కు వివరించారు. సకాలంలో స్పందించి మహిళను కాపాడిన సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.

దిశ యాప్​కు స్పందన

ఇదీ చదవండి:

ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు

Last Updated :Feb 11, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.