ETV Bharat / international

కారుకు ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.122 కోట్లు ఖర్చు.. ప్రత్యేకత ఇదే..

author img

By

Published : Apr 10, 2023, 1:51 PM IST

Updated : Apr 10, 2023, 2:23 PM IST

'P7' అత్యంత ఖరీదైన వాహన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన "మోస్ట్ నోబుల్ నంబర్స్" వేలంలో.. ఈ కారు నంబర్ ప్లేట్‌ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా 55 మిలియన్​ దిర్హమ్​లకు​ (దాదాపు 122 కోట్ల రూపాయలకు) అమ్ముడుపోయింది. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు.

P7 car number plate sold for 55 million dirhams
p7 నంబర్ ప్లేట్ దుబాయ్

దుబాయ్‌లో జరిగిన "మోస్ట్ నోబుల్ నంబర్స్" వేలంలో.. ఓ నంబర్​ ప్లేట్​ భారీ ధర పలికింది. 'P7' అనే కారు నంబర్​ ప్లేట్​ ఏకంగా 55 మిలియన్​ దిర్హమ్​లకు ​(దాదాపు 122 కోట్ల రూపాయలకు) అమ్ముడుపోయింది. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్​లో ఈ వేలం పక్రియ జరిగింది.

మొదట 15 మిలియన్​ దిర్హమ్​ల​ (దాదాపు 33.5 కోట్ల రూపాయలు) వద్ద ఈ నంబర్​ ప్లేట్​ వేలం ప్రారంభమైంది. అనంతరం కొన్ని సెకన్లకే.. 30 మిలియన్ల దిర్హమ్​లకు (66 కోట్ల 90 లక్షల రూపాయలకు)​ చేరింది. 25 మిలియన్ల దిర్హమ్​ల వద్ద​ కాసేపు వేలం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. అనంతరం 30 మిలియన్ల దిర్హమ్​లకు.. ఆ వెంటనే 55 మిలియన్​ దిర్హమ్​లకు చేరుకుంది. వేలం పూర్తవగానే ప్రేక్షకుల చప్పట్లతో హాల్​ మొత్తం మార్మోగింది. పావెల్ వాలెరివిచ్ దురోవ్​కు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.

P7తో పాటు మిగతా వీఐపీ నంబర్​ ప్లేట్లు, ఫోన్​ నంబర్​లకు కూడా వేలం జరిగింది. ఈ వేలంతో మొత్తం 100 మిలియన్​ దిర్హమ్​లు (223 కోట్ల రూపాయలు) సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ వేలం, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, ఎటిసలాట్ అండ్​ డు అధ్వర్యంలో ఈ వేలం పక్రియ జరిగింది. ఇప్పటి వరకు దుబాయ్​లో జరిగిన వేలంలో.. 'P7' మొదటి స్థానంలో నిలిచింది. 2008లో అబుదాబి నంబర్ 1 ప్లేట్​ను 52.2 మిలియన్ దిర్హమ్‌లకు.. ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.

ఆకలి తీర్చనున్న ఫ్యాన్సీ నంబర్ క్రేజ్​!
ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం.. వన్ బిలియన్ మీల్స్ ప్రచారానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం కృషి చేస్తుందని వారు వెల్లడించారు. అందుకోసం ఈ సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ ఉదార స్ఫూర్తికి అనుగుణంగా వన్ బిలియన్ మీల్స్ ఎండోమెంట్‌ కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రారంభించారు.

వేలం పాటలో రూ. అరకోటికి అమ్ముడుపోయిన ఐఫోన్​
కొద్ది రోజుల క్రితం అమెరికాలో 2007లో కొన్న ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్.. ఇటీవల రూ.52లక్షలకు (63వేల డాలర్లు) అమ్ముడుపోయింది. ఎల్​సీజీ హౌస్​ వేసిన వేలం పాటలో ఈ పాత ఫోన్​ను కొనేందుకు ఎగబడ్డారు. ఇన్వెస్టర్లు, పాత ఫోన్లు సేకరించే వారు పెద్ద ఎత్తున ఈ వేలంలో పాల్గొన్నారు. 50వేల డాలర్లు వస్తాయని ముందుగా అంచనా వేయగా.. ఈ ఫోన్ ఏకంగా 63 వేల డాలర్లకు పైగా రాబట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

Last Updated :Apr 10, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.