ETV Bharat / international

Justin Trudeau Statement On India : 'ఆ విషయాన్ని భారత్​కు అప్పుడే చెప్పాం.. మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం'

author img

By PTI

Published : Sep 23, 2023, 10:32 AM IST

Updated : Sep 23, 2023, 11:21 AM IST

Justin Trudeau Statement On India : భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ నేత హర్దీప్​ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించిందని ట్రూడో చెప్పారు.

justin trudeau statement on india
justin trudeau statement on india

Justin Trudeau Statement On India : ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్​ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో మరోసారి పాతరాగమే అందుకున్నారు. హర్దీప్ సింగ్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయంపై విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్​తో కెనడా పంచుకుందని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కెనడా-భారత్​ మధ్య ఉద్రిక్తతలను జస్టిన్ ట్రూడో మరింత పెంచారు.

'ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ హత్య గురించి సోమవారం నేను మాట్లాడిన విషయానికి సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని కొన్ని వారాల క్రితమే భారత్‌కు అందించాం. ఈ విషయంలో మేం భారత్‌తో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తీవ్రమైన అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్​.. మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం' అని ట్రూడో అన్నారు.

అమెరికా స్పందన..
India Canada Conflict : మరోవైపు.. భారత్​పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లేవనెత్తిన ఆరోపణలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. కెనడాతో వివాదంపై అమెరికా నేరుగా భారత్​తో సంప్రదించిందని వెల్లడించారు. 'ఈ వివాదంలో జవాబుదారీతనాన్ని అమెరికా చూడాలనుకుంటోంది. కెనడాతో భారత్ కలిసి​ పనిచేస్తోందని ఆశిస్తున్నాం' అని బ్లింకెన్ అన్నారు.

  • VIDEO | "We have been consulting throughout very closely with our Canadian colleagues, and not just consulting, coordinating with them on this issue. And from our perspective, it is critical that the Canadian investigation proceeds and it would be important that India work with… pic.twitter.com/kCmwXgIij0

    — Press Trust of India (@PTI_News) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అమెరికాకు భారత్​ చాలా ముఖ్యం'
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల వల్ల భారత్​ కంటే ఆ దేశానికే ఎక్కువ ప్రమాదమని అన్నారు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్​. వ్యూహాత్మకంగా కెనడా, భారత్​లలో ఏదో ఒక దేశాన్ని ఎంచుకోవాల్సి వస్తే .. అమెరికా భారత్​నే ఎంచుకుంటుదని తెలిపారు. వ్యూహాత్మకంగా కెనడా కంటే అమెరికాకు భారత్​ చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. అలాగే కెనడా.. భారత్​తో పోరాటానికి దిగడాన్ని 'ఏనుగుపై చీమ పోరాటం'గా అభివర్ణించారు. 'ఇరు మిత్ర దేశాల్లో దేన్ని ఎంచుకోవాలని అమెరికాకు ప్రతిష్ఠంభన ఉంటుంది. మిత్రదేశాల్లో అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైనది. భారత్​.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం' అని తెలిపారు.

కాగా.. ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్​ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయమున్నట్లు కెనడా ప్రధాని ఇటీవలే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి తన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమర్ధించుకుంటూ వస్తున్నారు.

Canada India Dispute : నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఖలిస్థానీలకు అనుకూలం.. భారత్​తో ఘర్షణ.. ఎందుకిలా?

Justin Trudeau On India : భారత్​పై అక్కసు.. అలా జరుగుతుందని ఊహించని ట్రూడో.. వెనక్కి తగ్గడమే శరణ్యం!

Last Updated :Sep 23, 2023, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.