ETV Bharat / international

Canada Reaction On Indias Ultimatum : 'భారత్​తో తెరవెనుక మంతనాలకు కెనడా సిద్ధం!'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 2:21 PM IST

Canada Reaction On Indias Ultimatum : భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాకు దిల్లీ మంగళవారం అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంపై తాజాగా స్పందించింది ట్రూడో ప్రభుత్వం. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి తెరవెనుక చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ఆ దేశ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చలు తెరవెనుక సాగించినప్పుడే ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయని ఆయన అన్నారు.

Canada Reaction On India's Ultimatum
Canada India Issue

Canada Reaction On Indias Ultimatum : భారత్‌లో పనిచేస్తున్న తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఒట్టావాకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అల్టిమేటం జారీ చేసిన వేళ ఈ అంశంపై కెనడా ప్రతిస్పందించింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి తెరవెనుక చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల భద్రతను చాలా కీలకంగా పరిగణిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. మరోవైపు భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం అనుకోవట్లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తమ దౌత్యవేత్తల భద్రతపై కెనడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

'ఈనెల 10లోగా రప్పించుకోండి..' : భారత్​
India Ultimatum To Canada : భారత్‌లో కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఒట్టావాకు దిల్లీ మంగళవారం అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 10లోగా దాదాపు 41 మంది అధికారులను వెనక్కి పిలిపించుకోవాలని ఆ దేశం అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ లండన్‌ కేంద్రంగా పనిచేసే ఓ పత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం దిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని వెనక్కి రప్పించుకోవాలని కెనడాకు భారత్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అక్టోబర్​ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని భారత్‌ అల్టిమేటంలో పేర్కొంది. అలా జరగకపోతే అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఆ కథనం వెల్లడించింది.

'ఇంకా పెరగాలని కోరుకోవట్లేదు..' : జస్టిన్‌ ట్రూడో
భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా పెరగాలని తమ దేశం ఏ మాత్రం కోరుకోవట్లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. తమ దేశం భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా కలిసి పని చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. భారత్‌లో నివాసముంటున్న కెనడా వాసుల కుటుంబాలకు సాయం చేయాలని అనుకుంటోందని ఆయన తెలిపారు. అందుకోసం భారత ప్రభుత్వంతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాము కోరుకుంటున్నట్లు ట్రూడో స్పష్టం చేశారు.

India Ultimateum To Canada : కెనడాకు భారత్​ అల్టిమేటం!.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు!

India Canada Row : 'నిజ్జర్​ హత్య విషయంలో అమెరికా మాతోనే'.. కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు

Jaishankar Statement On Canada : 'ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరా? నిజ్జర్ హత్యపై కచ్చితమైన ఆధారాలేవి?'.. కెనడాను కడిగేసిన జైశంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.