ETV Bharat / international

మరో కొత్త వేరియంట్‌.. వ్యాక్సిన్‌కు తలొగ్గని 'మ్యూ'!

author img

By

Published : Sep 1, 2021, 10:29 PM IST

కరోనా వైరస్ రోజుకో రూపం మార్చుకుంటోంది. రెండు రోజుల క్రితమే సీ.1.2 వేరియంట్ బయటపడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించగా.. ఇప్పుడు మరో రకం వెలుగులోకి వచ్చింది. దీన్ని 'మ్యూ'(μ) వేరియంట్ (mu variant)గా పిలుస్తున్నారు.

Mu covid variant
మ్యూ వేరియంట్

కరోనా వైరస్‌ మరింత బలపడుతూ కొత్త వేరియంట్లు(new covid variant) పుట్టుకొస్తూనే ఉన్నాయి. C.1.2గా పిలిచే ఓ వేరియంట్‌ బయటపడినట్లు రెండు రోజుల క్రితమే తేలగా.. మరో ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చింది. తాజాగా 'మూ'(μ) వేరియంట్‌(Mu variant)ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడినట్లు పేర్కొంది. ప్రస్తుతం 'మ్యూ'ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే ఈ వేరియంట్‌కు టీకాలను ఏమార్చే గుణాలున్నాయని దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడించింది.

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తన రూపాలను మార్చుకుంటూనే ఉంది. ఇప్పటికే డెల్టా(delta variant) వంటి కొత్త వేరియంట్లతో ఆయా దేశాల్లో విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్‌ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న C.1.2గా పిలిచే మరో వేరియంట్‌ బయటపడింది. తాజాగా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే 'మ్యూ' వేరియంట్‌ వెలుగుచూడడం ప్రపంచ శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తోంది.

డెల్టా, ఆల్ఫా దెబ్బతో...

కొవిడ్‌ నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొవిడ్‌ ఉత్పరివర్తనంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని స్వల్ప ప్రభావం చూపుతున్నప్పటికీ.. ఆల్ఫా, డెల్టా లాంటి వేరియంట్లు విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల రేటు మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆల్ఫా 193 దేశాల్లో విస్తరించగా.. 170 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ప్రభావం చూపే మరో రెండు వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగించే అంశం.

ఇదీ చదవండి: భారత్​లో 'దక్షిణాఫ్రికా' కరోనా వేరియంట్​- నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.