ETV Bharat / international

టెడ్​టాక్​లో ఏడేళ్ల చిన్నారి.. పిల్లల పెంపకంపై స్పీచ్

author img

By

Published : Jul 26, 2021, 2:01 PM IST

టెడ్​టాక్​ వేదికపై ఏడేళ్ల చిన్నారి అదరగొట్టింది. ఏ మాత్రం భయం లేకుండా గలగలా మాట్లాడేసింది. పిల్లల పెంపకంలో ఏమేం జాగ్రత్తలు పాటించాలో పెద్దలకు ఉదాహరణలతో సహా వివరించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చెప్పిందో మీరు చదివేయండి.

Molly Wright
మోలీ రైట్​

టెడ్​ టాక్​.. మైకులు దొరికితే రెచ్చిపోయే మహానుభావులే మాట్లాడ్డానికే జంకే వేదిక! అక్కడ మాట్లాడే వారు.. ఎంతో సాధన చేసిన తర్వాతగానీ ఆ స్టేజ్ ఎక్కరు. అలాంటిది ఓ ఏడేళ్ల చిన్నారి.. టెడ్​టాక్​లో ఏ మాత్రం భయం బెరుకు లేకుండా గలగలా మాట్లాడేసింది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివిరంగా చెప్పింది. అసలు ఇంతకీ ఎవరా చిన్నారి? చెప్పిందేంటి?

అతిపిన్న వయస్కురాలిగా..

ఆస్ట్రేలియా, క్వీన్స్​ల్యాండ్​కు చెందిన ఏడేళ్ల చిన్నారి మోలీ రైట్​ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక టెడ్​ టాక్ వేదికపై మాట్లాడిన అతిచిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో.. పిల్లల పెంపకంపై పెద్దలకు పలు సూచనలు చేసింది. ప్రతిబిడ్డకు ఐదేళ్ల వయసు ఎంతో కీలకం అని చెప్పింది. ఈ వయసులో పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమేం చేయాలో చక్కగా వివరించింది.

"దాగుడు మూతలు అనే ఆట ప్రపంచాన్ని మార్చేయగలదని నేను మీకు ఒకవేళ చెబితే ఎలా ఉంటుంది? ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే.. చిన్నారుల పెరుగుదల సమయంలో తీసుకోవాల్సిన కొన్ని శక్తివంతమైన విషయాల గురించి. నాకెలా వీటి గురించి తెలుసు అనుకుంటున్నారా? నా తల్లిదండ్రులు, నా చుట్టు ఉన్నవాళ్లను గమనించడం ద్వారా నాకు తెలిశాయి. నా స్నేహితులు, మా పాఠశాలలోని పిల్లలు, ఇంకా ప్రపంచంలో ఉన్న అనేకమంది చిన్నారులందరూ అదృష్టవంతులు కాదని నాకు తెలుసు. నేను ఈ పరిస్థితి మార్చేందుకు సాయం చేయాలనుకుంటున్నాను"

-మోలీ రైట్​, ఆస్ట్రేలియా చిన్నారి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మోలీరైట్​ ఓ ఏడాది వయసున్న ఆరి అనే పిల్లవాడిని, అతని తండ్రి ఆమర్​జోత్​ను ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకువచ్చి తన ప్రసంగాన్ని కొనసాగించింది. తన వీడియోలో.. చిన్నారి మెదడు ఎలా పరిణితి చెందుతుందో ఆమె వివరించింది​. ఏడేళ్ల వయసు వచ్చేవారికి 90శాతం చిన్నారుల్లో మెదడు వృద్ధి చెందతుందని తెలిపింది. 'చిన్నారులతో గడపడం', 'వారితో మాట్లాడటం', 'ఆడుకోవటం', 'వారిని ఆరోగ్యంగా ఉంచేలా చూడడం', 'చుట్టూ ఉన్నావారితో వారిని కలవనివ్వడం' వంటి ఐదు విషయాలను తల్లిదండ్రులు తప్పక పాటించాలని పేర్కొంది.

మోలీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. మిలియన్ల కొద్ది వ్యూస్​ వస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.