'154వ సినిమా అయినా ఫస్ట్ షాట్ అంటే ఇప్పటికీ టెన్షన్'.. సీక్రెట్ చెప్పిన చిరు

author img

By

Published : Jan 15, 2023, 4:31 PM IST

chiranjeevi revealed secret suma adda
chiranjeevi revealed secret suma adda ()

మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ప్రమోషన్లలో భాగంగా​ సుమ యాంకర్​గా వ్యవహరిస్తున్న 'సుమ అడ్డా' షోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. షోలో సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో సుమ సంధించిన ఓ ప్రశ్నకు జావాబిస్తూ.. ఓ ఆసక్తికర విషయం చెప్పారు​. అదేంటంటే..

154వ సినిమా అయినా ఫస్ట్ షాట్ అంటే ఇప్పటికీ టెన్షన్.. సీక్రెట్ చెప్పిన చిరు

మెగాస్టార్​ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' బ్లాక్​బస్టర్​గా దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరు.. ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షోకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు ఈ షోకు దర్శకుడు బాబీ, హాస్యనటుడు వెన్నెల కిషోర్​ వచ్చి సందడి చేశారు.

'సుమ అడ్డా' షోలో మెగాస్టార్​కు​ గ్రాండ్​ వెలకమ్​ ఇచ్చారు. షోకు వచ్చిన అభిమానులు అరుపులతో మోతెక్కించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. 'జేజమ్మా' అని సుమను ఆటపట్టించారు. 'పూనకాలు లోడింగ్​ అని ఏ సమయంలో బాబీ అన్నాడో కానీ నింజగా థియేటర్లలో పూనకాలు వస్తున్నాయి' అని అన్నారు మెగాస్టార్​. అనంతరం షో యాంకర్​ సుమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను.. నీ గ్రోత్​ను గమనిస్తున్నాను. నీలాంటి వాళ్లు యాంకర్​గా ఉన్న ఇలాంటి షోకు రావడం ఓ స్టేటస్​గా ఫీల్​ అవుతున్నాను' అని సుమను ఆకాశానికెత్తేశారు.

ఈ క్రమంలో సుమ మెగాస్టార్​ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ' మేము సినీ పరిశ్రమకు రావడానికి చిరంజీవి కారణమని చాలా మంది అంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?' అని అడిగారు. దీనికి మెగాస్టార్​ సమాధానమిస్తూ.. ''యాక్టర్లు, డ్యాన్సర్లు, ఫైట్​ మాస్టర్లు లాంటి చాలా మంది.. 'మీ స్ఫూర్తితోనే సిమాల్లోకి వచ్చాం' అంటుంటారు. అంలాటివి విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా స్టార్​ స్టేటస్, సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్​​ కన్నా ఇలాంటివే నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఇది నాకు దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్న'' అని సమాధానమిచ్చారు.

అనంతరం దర్శకుడు బాబీ స్పందిస్తూ.. మెగాస్టార్​ చిరంజీవి సెల్ఫ్​మేడ్​ స్టార్​ అని.. అయన ప్రతి సినిమా మొదటి మూవీలానే ప్రెజెంట్​ చేస్తారు అని చెప్పారు. దీనిపై సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.. 'అది ఏ సినిమా అయినా ఎంత నంబర్​ అయినా.. నాకు మొదటి చిత్రం 'ప్రాణం ఖరీదు' చేస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతి రోజు.. ఏ సన్నివేశం అయినా.. ఏ క్యారక్టర్​ అయినా కొత్తగా చేయాలని పరితపిస్తుంటాను' అని చెప్పారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్యలో ఓ సీన్​ను పండించడానికి తాను ఏం చేశానో చెప్పారు చిరంజీవి. ఇంటి నుంచే వేరుశెనగ పొట్టు తీసుకెళ్లానని గుర్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.