ETV Bharat / entertainment

విజయ్​, షారుక్​తో శంకర్​ సినిమా.. రూ. 900 కోట్ల బడ్జెట్..!

author img

By

Published : Feb 9, 2023, 8:49 PM IST

ప్రముఖ దర్శకుడు శంకర్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు. దీనికోసం బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, కోలీవుడ్​ సూపర్​ స్టార్ విజయ్​ను సంప్రదించారట. దాదాపు ఈ సినిమా రూ. 900 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోందని సమాచారం. ఈ వివరాలివే..

vijay shahruk khan shankar
vijay shahruk khan shankar

భారీ బడ్జెట్​.. అంతకు మించి ఎంటర్​టైన్​మెంట్.. కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలను తీయగల ప్రతిభావంతుడు డైరెక్టర్​ ఎస్ శంకర్​. ఆయన సినిమా తీస్తే భాష ఏదైనా బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే. ఈ డైరెక్టర్​ ప్రస్తుతం.. కమల్​హాసన్​తో 'భారతీయుడు-2', మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​​తో '#ఆర్​సీ15' చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇప్పుడీ దర్శకుడి​ నుంచి మరో సినిమా రాబోతుందని సమాచారం. బాలీవుడ్​, కోలీవుడ్​కు చెందిన అగ్ర కథానయకులతో మల్టీ స్టారర్​ ప్లాన్​ చేయబోతున్నాడట ఈ దర్శకుడు.

సముద్ర గర్భంలో జరిగే సైన్స్​ ఫిక్షన్ సినిమాను శంకర్​ తీయబోతున్నారట. దీనికోసం తమిళ హీరో విజయ్, బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​లతో చర్చలు కూడా జరిపారట. తదుపరి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని రూ. 900 కోట్ల భారీ బడ్జెట్​తో రెండు నిర్మాణ సంస్థలు నిర్మించనున్నాయని సమాచారం. అయితే, శంకర్​ ఇప్పటికే 'భారతీయుడు-2', 'ఆర్​సీ15' సినిమాలను ప్యారలెల్​గా తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు విజయ్​, షారుక్​ ఖాన్​ల కాల్షీట్లు కూడా దొరకాలి. దీంతో ఈ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. అయితే అధికారికంగా దర్శకుడు, నిర్మాణ సంస్థలు స్పందించలేదు. ఇదే గనుక నిజమైతే బాక్సాఫీసు వద్ద మోత మోగడం ఖాయం.

ఇకపోతే, షారుక్​ ఖాన్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'పఠాన్'​ విజయంతో ఊపుమీదున్న ఈ స్టార్ నుంచి​.. ఈ ఏడాది 'జవాన్', 'డుంకి' అనే మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అయితే 'జవాన్'​ చిత్రంలో.. విజయ్​ గెస్ట్​ రోల్​లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, విజయ్​ విషయానికొస్తే.. ఇప్పుటికే ఈ స్టార్​ హీరో వారసుడుతో సందడి చేశారు. లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమా 'లియో' కూడా త్వరలో విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.