ETV Bharat / entertainment

'వీరసింహారెడ్డి'లో స్పెషల్​ ఎలిమెంట్.. ఫ్యాన్స్​ విజిల్స్ వేయాల్సిందే!

author img

By

Published : Dec 30, 2022, 7:50 PM IST

Veera Simha Reddy : బాలకృష్ణ అంటే మాస్​ యాక్షన్​కు చిరునామా అంటుంటారు. అలాంటి మాస్​ సింహం కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, ఈ సినిమాలో మాస్​, యాక్షన్​ మిస్​ కానప్పటికీ.. ఓ స్పెషల్​ ఎలిమెంట్​తో సంపూర్ణ చిత్రాన్ని అందిస్తారట బాలకృష్ణ. ఆ స్పెషల్​ ఎలిమెంట్​ ఏంటో తెలుసా..

Veera Simha Reddy
Veera Simha Reddy

Veera Simha Reddy : నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆయన సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఉన్న సన్నివేశాల్లోనూ తన నటనతో థియేటర్లో విజిల్స్ వేయిస్తారు బాలకృష్ణ. త్వరలో అలా సందడి చేయడానికే ఈ హీరో అభిమానులు సిద్ధమవ్వలంటున్నారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, పోస్టర్లు చూస్తుంటే మాస్‌, యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అనిపిస్తుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుందనే అంటున్నారు.

veerasimha reddy
వీరసింహారెడ్డి

బాలకృష్ణ గతంలో నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలు 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు'లో లాగానే ఈ 'వీరసింహారెడ్డి'లో కూడా హృదయానికి హత్తుకునే కుటుంబ సన్నివేశాలు ఉండనున్నాయట. వరలక్ష్మి శరత్‌కుమార్‌, బాలకృష్ణకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టించేలా ఉంటాయంటున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్రతో సినిమాలో కీలక మలుపు చోటుచేసుకుంటుందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు చిత్రబృందం ఈ సినిమాలోని మూడు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్‌ నటించిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.