ETV Bharat / entertainment

వాళ్లలా నటించడం నాకు చేతకాదు: తాప్సీ

author img

By

Published : Dec 16, 2022, 1:48 PM IST

విలేకర్లపై తాను అసహనం వ్యక్తం చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలపై స్పందించారు హీరోయిన్ తాప్సీ. తనను విమర్శించిన వారికి గట్టి సమాధానమిచ్చారు.

Tapsee fire on journalists
వాళ్లలా నటించడం నాకు చేతకాదు: తాప్సీ

బాలీవుడ్‌లో వరుసగా విభిన్న కథల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి తాప్సీ పన్ను. ఇటీవల 'దోబారా' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె విలేకర్లు అడిగిన ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో వాటిని చూసిన నెటిజన్లు.. తాప్సికి పొగరు పెరిగిందని కామెంట్స్ చేశారు. తాజాగా దానిపై తాప్సీ స్పందించారు. కొంతమంది నటీనటుల మాదిరిగా కెమెరాల ముందు నటించడం తనకు రాదని నటి తాప్సీ పన్ను అన్నారు. కెమెరా ముందు ఒక రకంగా, వెనుక మరొక విధంగా ఉండటం తనకు చేతకాదని.. తానెప్పుడూ నిజాయతీగానే ఉంటానని చెప్పారు.

"ఇటీవల విలేకర్లపై నేను ఆగ్రహం వ్యక్తం చేసిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసి చాలామంది నాపై విమర్శలు చేశారు. సోషల్‌మీడియాలోనూ నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నిజం చెప్పాలంటే వాళ్ల మాటల వల్ల నేనెంతో బాధపడ్డాను. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని, నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడను. నాకు నచ్చిన విధంగా ఉంటాను. ఇంటర్వ్యూల్లోనూ నా మనసుకు అనిపించింది మనస్ఫూర్తిగా మాట్లాడతాను. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది స్టార్స్‌ బయట నటిస్తుంటారు. అలాంటి వారి గురించి నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వారి గౌరవం దెబ్బ తింటుంది. అందరికీ నేను నచ్చాలని లేదు. కాబట్టి, నటిగా నా వర్క్‌ని వాళ్లు మెచ్చుకుంటే చాలు" అని తాప్సి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.