ETV Bharat / entertainment

క్రిటికల్​గా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం.. ఐసీయూలో వెంటిలేటర్​పై చికిత్స

author img

By

Published : Nov 14, 2022, 10:37 AM IST

Updated : Nov 14, 2022, 1:25 PM IST

Superstar Krishna admitted in hospital
సూపర్‌ స్టార్‌ కృష్ణకు అస్వస్థత

10:35 November 14

Superstar Krishna

అనారోగ్య కారణాల వల్ల కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న స్టార్ హీరో మహేశ్​ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుఝామున మహేశ్​ భార్య నమ్రత గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రికి చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. స్వల్ప గుండెపోటు కూడా వచ్చినట్లు సమాచారం. సీపీఆర్‌ కూడా చేశారట. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్​స్టార్ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

అయితే కృష్ణ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. కృష్ణ ఆరోగ్యం క్రిటికల్​గా ఉన్నట్లు పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమని చెప్పారు. ఐసీయూలో వెంటిలేటర్​పై చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ఱ కుటుంబంలో ఇటీవలే వరుసగా రెండు విషాదాలు చోటు చేసుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు రమేశ్​ బాబు, భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి: బన్నీ మూవీలో నటించా.. డబ్బులు ఎగ్గొట్టారు!: వకీల్​సాబ్​ సూపర్​ ఉమెన్​ ఎమోషనల్

Last Updated :Nov 14, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.