ETV Bharat / entertainment

షారుక్​ 'పఠాన్'కు అరుదైన గుర్తింపు.. ఆ ఫార్మాట్​లో రిలీజ్ కానున్న తొలి మూవీగా!

author img

By

Published : Dec 25, 2022, 1:22 PM IST

Updated : Dec 25, 2022, 1:28 PM IST

షారుక్​, దీపిక, జాన్ అబ్రహం నటించిన 'పఠాన్' అరుదైన గుర్తింపు పొందింది. ఐసీఈ (ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్‌పీరియన్స్) ఫార్మాట్​లో విడుదల కానున్న తొలి ఇండియన్ సినిమాగా ఘనత దక్కించుకోనుంది.

Pathan Movie In  ICE Format
Pathan Movie In ICE Format

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ 'పఠాన్'. యశ్​రాజ్ ఫిల్మ్స్ బ్యానర్​లో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో సహా హిందీ, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీని ఐసీఈ(ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్‌పీరియన్స్) థియేటర్​ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు యశ్​ రాజ్​ ఫిల్స్మ్ బ్యానర్​ ప్రకటించింది. దీంతో ఈ ఫార్మాట్​లో విడుదల కానున్న తొలి భారత చిత్రంగా 'పఠాన్'​ ఘనత సాధించనుంది.

ఐసీఈ థియేటర్ ఫార్మాట్‌ అంటే?
ఐసీఈ థియేటర్ ఫార్మాట్​లో మెయిన్ స్క్రీన్​తో పాటు సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. సాధారణంగా కనిపించే కలర్స్, కదలికలకు పూర్తి భిన్నంగా మెరుగైన ఇమ్మర్షన్‌ను అందిస్తాయి సైడ్ ప్యానెల్స్​. సినిమాలో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యే అనుభూతిని ఈ ఫార్మాట్​లో వచ్చే​ చిత్రాలు అందిస్తాయి. అంతర్జాతీయంగా 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్', 'ది బ్యాట్‌మ్యాన్', 'ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్', 'టాప్ గన్: మావెరిక్ అండ్ మోర్బియస్' వంటి సినిమాలు ఈ హై-ఎండ్ ఫార్మాట్‌లో ఐసీఈ థియేటర్‌లలో విడుదలయ్యాయి.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తాము ఎప్పుడు ముందుటామని యశ్​ రాజ్​ ఫిల్స్మ్​ డిస్ట్రిబ్యూటర్​ రోహన్ మల్హోత్రా అన్నారు. ప్రేక్షకులకు అత్యంత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడానికి ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించడంలో యశ్​ రాజ్ ఫిల్మ్స్ ముందుందని మల్హోత్రా తెలిపారు.

Last Updated :Dec 25, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.