ETV Bharat / entertainment

'సైంధవ్' బ్యూటీకీ కోహ్లీ బావ అవుతాడా? - సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 2:08 PM IST

Saindhav Ruhani Sharma : సైంధవ్ బ్యూటీ రుహానీ శర్మ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. స్టార్ క్రికెట్​ కోహ్లీ - బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తనకు అక్క - బావ అవుతారని చెప్పింది. ఎలా అంటే?

'సైంధవ్' బ్యూటీకీ కోహ్లీ బావ అవుతాడా? - సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్​
'సైంధవ్' బ్యూటీకీ కోహ్లీ బావ అవుతాడా? - సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్​

Saindhav Ruhani Sharma : 'చి.ల.సౌ'తో పరిచయమైన హీరోయిన్​ రుహానీ శర్మ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. తన గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ 'హిట్‌' సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అనంతరం తెలుగుతో పాటు వేరే భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంక్రాంతికి తెలుగులో వెంకటేశ్​ సైంధవ్‌ సినిమాతో రాబోతుంది. అయితే తాజాగా ఈ భామ ఓ షాప్ ఓపెనింగ్​ వచ్చి మీడియాతో సరదాగా ముచ్చటించింది. తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బాలీవుడ్ హీరోయిన్​ అనుష్క శర్మ తనకు సిస్టర్​ అవుతుందని, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన బావ అని చెప్పుకొచ్చింది.

"వెంకటేశ్​ గారి చాలా సినిమాలు చూశాను. ఎక్కువగా హిందీ డబ్బింగ్ చిత్రాలు చూశాను. ఆయనంటే చాలా అభిమానం ఉంది. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా డ్రీమ్ మారిపోయింది. ఇప్పుడు యాక్టర్ అయిపోయాను. సైంధవ్‌ మూవీలో డాక్టర్​గా పనిచేయడం చాలా ఆనందంగా అంది. కనీసం ఇలా అయినా నా చిన్నప్పటి కల నెరవేరింది" అని చెప్పింది.

కోహ్లీ బావ : అవును. కానీ దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు. అయినా మీకెలా తెలిసింది? అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ. వారిద్దరు చాలా మంచిగా, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్​గా ఉంటారు. అందుకే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కోహ్లీ చాలా మంచివారు." అని రుహాని శర్మ పేర్కొంది. ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 'హిట్‌' సిరీస్‌ విజయాల తర్వాత శైలేష్ కొలను దర్శకత్వం వహించిన కొత్త చిత్రమే 'సైంధవ్‌'. ఇది హీరో వెంకటేశ్‌కు 75వ చిత్రం. మరో మూడు రోజుల్లో 13న రిలీజ్​ కానుంది. వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కథానాయికలుగా నటించారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ తెగ వెయిటింగ్​ - ఐఎండీబీ లిస్ట్​లో టాప్​ మూవీస్​ ఇవే

'గేమ్​ ఛేంజర్​'కి నేను కూడా పని చేశాను - రెండు రోజుల పాటు ఆ లోకేషన్​లోనే ఉన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.