ETV Bharat / entertainment

సాయిపల్లవికి క్రేజీ ఆఫర్​- యశ్​ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 3:38 PM IST

Updated : Dec 5, 2023, 3:56 PM IST

Sai Pallavi Yash Movie : దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత షూటింగ్​ల్లో బిజీ అయింది స్టార్ హీరోయిన సాయిపల్లవి. ఇప్పటివరకు తెలుగు సహా తమిళ్, మలయాళ భాషల్లో నటించిన సాయిపల్లవి ఇప్పుడు సాండల్​వుడ్​లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు కేజీఎఫ్​ స్టార్ యశ్​ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

Sai Pallavi Yash Movie
Sai Pallavi Yash Movie

Sai Pallavi Yash Movie : సహజ నటనతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. డాక్టర్​ విద్యనభ్యసించిన ఈ చిన్నది.. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ మూవీ 'ప్రేమమ్'​ ద్వారా తెరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల ఫిదా చేసింది. ఈ సినిమాలోని ఒక్క సీన్​ వల్ల 'మలర్​ మిస్'​గా పాపులరైపోయింది. ఆ తర్వాత దుల్కర్​ సల్మాన్​తో 'కలి' అనే సినిమాలో మెరిసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్ల వెల్లువ మొదలయ్యాయి. అయితే వరుస అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగేసింది. అలా 'ఫిదా'తో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చితెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చివరగా 2022లో వచ్చిన తమిళ చిత్రం 'గార్గి' తర్వాత కొంత గ్యాప్​ తీసుకున్న సాయిపల్లవి, ప్రస్తుతం తమిళంలో హీరో శివకార్తికేయన్​తో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో నాగచైతన్యతో 'తండేల్​'లో లీడ్​ రోల్​​లో నటిస్తోంది.

Sai Pallavi Upcoming Project : ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించింది సాయిపల్లవి. అయితే ఈ అమ్మడు గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేచురల్ బ్యూటీ సాండల్​వుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'కేజీఎఫ్​' ఫేమ్​ హీరో యశ్​తో ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సోమవారం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్​ ఇచ్చారు యశ్​. డిసెంబర్​ 8న సినిమా టైటిల్​ ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్​ 8న సినిమా టైటిల్​ ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న ఉదయం 09:55 గంటలకు 'యశ్​ 19' టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ సినిమాలో లీడ్​ రోల్​ ప్లే చేస్తుందని సినీ వర్గాల టాక్​. కాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

యూకే వెళ్లేందుకు తిప్పలు - 25 ఏళ్ల తర్వాత రివెంజ్ - ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్న 'డంకీ' ట్రైలర్​

'యానిమల్'​ మూవీలో సుందరమైన ప్యాలెస్​ - ఆ స్టార్​ హీరోదేనట

Last Updated : Dec 5, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.