రష్మికకు కూడా గిల్​ అంటే ఇష్టమేనా?.. మనోడి ఫాలోయింగ్ అలా ఉంది మరి!

author img

By

Published : Mar 12, 2023, 4:53 PM IST

rashmika mandhana reacted on shubman gill comments

టీమ్​ఇండియా క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​ కామెంట్స్​పై స్పందించింది టాలీవుడ్ హీరోయిన్ రష్మిక. 'గిల్​కు​ మీరు క్రష్​ అంట?' అని అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతో బదులిచ్చింది. అంతేగాక తన చేతులతో హార్ట్​ సింబల్​ను చూపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ వైరలవుతోంది.

టీమ్​ఇండియా క్రికెటర్ శుభ్​మన్​ గిల్.. ఇటీవలే టాలీవుడ్​ భామ రష్మిక మందన్నపై క్రష్(లవ్​)​ ఉందంటూ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని హీరోయిన్​ రష్మికను అడగ్గా.. చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. చేత్తో హార్ట్​ సింబల్​ను చూపించింది. దీంతో శుభ్​మన్​, రష్మికల మధ్య ఏదో ఉందన్న గాసిప్స్​కు మరింత బలం చేకూరింది. ఈ ప్రశ్నను ఆమె తిరస్కరించకుండా నవ్వడం వల్ల.. ఈ మొత్తం వ్యవహారం గురించి రష్మికకు అవగాహన ఉందన్న విషయం అర్థమవుతోంది.

ఇటీవల రష్మిక హైదరాబాద్​లో ఓ కార్యక్రమంలో మెరిసింది. ఈ ఈవెంట్​లో ఆమెను విలేకరులు రష్మికపై శుభ్​మన్​ చేసిన కామెంట్స్​ను ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన ఆమె చిరునవ్వుతో కూల్​గా సమాధానం ఇచ్చింది. అంతేగాక తన రెండు చేతులతో హార్ట్​(గుండె)సింబల్​ను చూపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్​ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాధానంతో తనక్కూడా(రష్మిక) శుభ్​మన్​ అంటే ఇష్టమనే విషయం అర్థమవుతోందని కొందరు నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు.

ఏంటీ రష్మిక, శుభ్​మన్​ల కహానీ?
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో శుభ్​మన్​ గిల్​ తన క్రష్​ ఎవరని అడిగిన ప్రశ్నకు.. టాలీవుడ్​ నటి రష్మిక మందన్న అని చెప్పకనే చెప్పేశాడంటూ నెట్టింట్లో వార్తలు హల్​ చల్​ చేశాయి. 'మీకు ఇష్టమైన బాలీవుడ్​ హీరోయిన్​ ఎవరు..?' అంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్​ శుభ్​మన్​ ప్రశ్న అడిగారు. ఇందుకు సమాధానంగా రష్మిక మందన్న అంటూ గిల్​ ఆన్సర్​ ఇచ్చాడట. అయితే రష్మిక కంటే ముందు శుభ్​మన్​కు నటి సారా అలీఖాన్​, సచిన్​ తెందూల్కర్​ కుమార్తె సారా తెందూల్కర్​ల మధ్య ఏదో నడుస్తోందనే గాసిప్స్​ కూడా తెగ వైరల్​ అయ్యాయి. దీంతో ఈ ప్రోగ్రాంలో గిల్​ వీరిద్దరి పేరే చెప్తాడనుకుంటే.. సడెన్​గా రష్మిక పేరు చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా, వీరిద్దరి పేర్లు సోషల్​ మీడియాలో ట్రెండ్​ అయ్యాయి. దీనిపై స్పందించిన గిల్​.. అసలు తాను ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించానో తెలియడం లేదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అందరూ మళ్లీ కన్య్ఫూజన్​లో పడ్డారు. తాజాగా ఈ గాసిప్స్​ను శుభ్​మన్​ గిల్​ కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే రష్మిక నవ్వుతూ.. హార్ట్​ సింబల్​ చూపించడంతో కథ మొదటికి వచ్చినట్లయింది.

అయితే రష్మికను ఓ ప్రోగ్రామ్​లో అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియోను ముంబయికి చెందిన కొందరు ఫొటోగ్రాఫర్లు ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు. ఇది కాస్త వైరల్​గా మారి రష్మిక అభిమానుల వరకు వెళ్లింది. దీన్ని చూసిన ఫ్యాన్స్​ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్​కు రిప్లైగా 'యే కిసీ బీ క్రికెటర్​కి క్రష్​ నహీ హై' అని గిల్​ స్పష్టం చేశాడంటూ ఓ అభిమాని కామెంట్​ చేశాడు. ఈ విషయంపై మరో ఫ్యాన్​ 'శుభ్​మన్​ క్లారీటి ఇచ్చాడు, ఇకపై దీనిగురించి ఎవరూ ఏమి మాట్లాడకండి' అంటూ సీరియస్​గా కామెంట్​ పెట్టాడు. రష్మిక ఫ్యాన్స్​కు కోపం తెప్పించే మరో కామెంట్​ కూడా పెట్టాడు ఓ అభిమాని..'ఇంతకీ రష్మిక మందన్న ఎవరో కూడా ఎవరికీ తెలియదు.. అలాంటిది ఆమె శుభ్​మన్​కి క్రష్​ ఏంటి..?' అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు.

ఇదిలా ఉంటే గతేడాది కూడా ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్​ను.. 'బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు?' అంటూ అడగిన ప్రశ్నకు.. వెంటనే సారా అలీ ఖాన్​ అని సమాధానం ఇచ్చాడు. అయితే 'మీరు సారాతో డేటింగ్​లో ఉన్నారా?' అని అడగ్గా.. 'అవును, లేదు' అంటూ రండు సమాధానాలతో అందరిని డైలమాలో పడేశాడు. ఎప్పుడూ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే గిల్​ తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్​ చేస్తాడు. కాగా అప్పట్లో సారా అలీ ఖాన్, శుభ్​మన్​లు పలు సందర్భాల్లో కలిసి తిరిగిన ఫొటోలు కనిపించడం వల్ల ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అభిమానులు చెవులు కొరుక్కోవడం​ ప్రారంభించారు. అయితే ఈ విషయంపై సారా, గిల్ కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు రష్మికకు గిల్​తోనే కాకుండా రౌడీ హీరో విజయ్​ దేవరకొండతోనూ జతకట్టారు. గీతాగోవిందం సినిమాలో నటించిన వీరిద్దరు డేటింగ్​లో ఉన్నారంటూ వార్తలు నిలిచారు. అయినా ఇద్దరూ దీనిపై స్పందించలేదు.. కానీ సోషల్​ మీడియాలో వీరు పెట్టే పోస్టులు, ఫొటోలు వీరి రిలేషన్​షిప్​కు మరింత బలం చేకూర్చాయి. ఇకపోతే సినిమాల విషయానికొస్తే రష్మిక 'పుష్ప-2' సినిమాలో అల్లు అర్జున సరసన నటించనుంది. బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్​తో కలిసి 'యానిమల్' చిత్రంలో అలరించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.