ETV Bharat / entertainment

Dada Saheb Phalke: ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌.. RRR మూవీకి అవార్డు..

author img

By

Published : Feb 20, 2023, 10:28 PM IST

Updated : Feb 21, 2023, 6:39 AM IST

బాలీవుడ్ స్టార్​ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు.. బ్రహ్మస్త్రకు సినిమాకుగాను ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వరించింది. ఇంకా ఎవరెవరు ఈ పురస్కారాల్ని అందుకున్నారంటే?

Dada saheb phalke festival
Etv Dada saheb phalke festival

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌' అట్టహాసంగా జరిగింది. సోమవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌ సినీ తారలు విచ్చేసి సందడి చేశారు.
కాగా, ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురింపించిన 'కాంతారా'లో నటనకు గానూ రిషబ్‌శెట్టి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు అవార్డును అందుకున్నారు. చిత్రీకరణలో బిజీగా ఉండి రణ్‌బీర్‌ హాజరుకాలేకపోవడంతో ఆయన సతీమణి, నటి అలియా భట్‌ ఉత్తమనటుడి అవార్డు అందుకున్నారు. కపోతే ఈ కార్యక్రమానికి హాజరైన తారలందరూ అదిరిపోయే స్టైలిష్‌ డ్రెస్సుల్లో మెరిసిపోయారు.

విజేతలు వీరే..

  • ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌
  • ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)
  • ఉత్తమ నటుడు‌: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
  • మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (కాంతారా)
  • క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌: వరుణ్‌ ధావన్‌ (బేడియా)
  • మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌
  • బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్ తాండన్‌
  • క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌ (జల్సా)
  • ఉత్తమ సహాయ నటుడు: మనీష్‌ పాల్‌ (జగ్‌ జగ్‌ జీయో)
  • ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆర్‌ఆర్‌ఆర్‌

టెలివిజన్‌ విభాగంలో..

  • ఉతమ నటుడు: జైన్‌ ఇమనాన్‌
  • ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్‌
  • ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా

వెబ్‌ సిరీస్‌ విభాగంలో..

  • ఉత్తమ వెబ్‌సిరీస్‌: రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
  • ఉత్తమ నటుడు: జిమ్ షార్బ్ (రాకెట్‌ బాయ్స్‌)
  • టెలివిజన్‌ సిరీస్ ఆఫ్‌ ఆది ఇయర్‌: అనుపమ (సీరియల్‌)

ఇదీ చూడండి: ఆ దర్శకుడితో కమల్​హాసన్​ కొత్త మూవీ.. ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ షురూ!

Last Updated :Feb 21, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.