ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ 'పుష్ప 2'లో రామ్​చరణ్​.. నిజమేనా?

author img

By

Published : Dec 10, 2022, 10:30 AM IST

పుష్ప 2లో రామ్​చరణ్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Ramcharan in pushpa 2
అల్లు అర్జున్​ 'పుష్ప 2'లో రామ్​చరణ్​.. నిజమేనా?

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పుష్ప: ది రైజ్‌. గతేడాది విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రెండో భాగం పుష్ప:ది రూల్‌ ప్రస్తుతం సిద్ధమవుతోంది. తొలి భాగానికి మంచి ఆదరణ లభించడంతో ఆ అంచనాలకు తగ్గకుండా సుకుమార్‌ రెండో భాగాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప2కు మరింత క్రేజ్‌ తీసుకొచ్చే పనిలో ఉంది చిత్ర బృందం. దీనికోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు కథలో మార్పులు కూడా చేసినట్లు ఇప్పటికే విన్నాం. ఇప్పటికే సినిమా ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోందని సినీ వర్గాల సమాచారం. సినిమా కథ మాత్రమే కాదు.. టేకింగ్‌ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు మూవీటీమ్​ చెబుతోంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మనోజ్ బాజ్‌పాయ్‌లు నటిస్తారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అలాంటివేవీ లేవంటూ నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే క్లైమాక్స్‌ లీక్‌ అంటూ వినిపిస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పుష్ప ది రూల్‌ సినిమాలో క్లైమాక్స్​లో రామ్‌ చరణ్‌ను చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఒకవేళ ఇది కనుక జరిగితే మాత్రం పుష్ప-2 సినిమా స్థాయి రేంజ్​ మాములుగా ఉండదు.

ఇదీ చూడండి: ఈ ఏడాది హిట్‌ కొట్టిన కొత్త డైరెక్టర్లు.. వారి చిత్ర విశేషాలివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.