ETV Bharat / entertainment

రజనీ కాంత్​తో ప్రభాస్ పోటీ​.. పక్కానా?

author img

By

Published : Mar 4, 2023, 10:24 AM IST

Updated : Mar 4, 2023, 11:01 AM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​.. తమిళ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ పోటీ పడనున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..

rajnikanth talaivar 170 to clash with prabhas project k for sankranti 2024
rajnikanth talaivar 170 to clash with prabhas project k

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అటు 'సలార్'​తో పాటు ఇటు 'ప్రాజెక్ట్​ కె' షూటింగుల్లో యాక్టివ్​గా ఉంటున్న ప్రభాస్..​ 2024 సంక్రాంతి సీజన్​ను తన సినిమా రిలీజ్​ కోసం లాక్ చేశారు. తన రీసెంట్​ మూవీ 'ప్రాజెక్ట్​ కె' రిలీజ్​ డేట్​ను సంక్రాంతికి ఫిక్స్​ చేశారు. ఈ విషయం డార్లింగ్​ ఫ్యాన్స్​కు ముందే తెలిసిందే కదా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇందులో విశేషం ఏముందంటే.. ఈ సినిమాతో ప్రభాస్​ ఇప్పుడు తమిళ సూపర్​ రజనీ కాంత్​తో తలపడనున్నారట.

ప్రస్తుతం నెల్సన్​ దిలీప్​ కుమార్​ తెరకెక్కిస్తున్న జైలర్​ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న రజనీకాంత్​ రీసెంట్​గా తన 170వ సినిమా గురించి ప్రకటించారు. 'తలైవర్​ 170' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా 2024 సంక్రాంతికి విడుదలయ్యేందుకు రెడీగా ఉందట. ఇప్పటికే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న టీమ్​ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. 'జై భీమ్'​ ఫేమ్ జ్ఞాన వేల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రజనీ ఫ్యాన్స్​. ఒక వేళ రజనీ సినిమా అప్డేట్​ అఫిషీయల్​ అయితే ఈ ఇద్దరు స్టార్స్ రానున్న సంక్రాంతికి​ కచ్చితంగా పోటీ పడే అవకాశాలున్నాయి.​

కాగా తమిళ సూపర్​ స్టార్​ తలైవా రజనీకాంత్​ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. మలేషియా,జపాన్​ సింగపూర్​లో ఈయనకు భారీ ఫ్యాన్​ బేస్​ ఉంది. ఇప్పటికీ 'బాషా', 'ముత్తు' లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కానీ ఆయన​ నటించిన గత చివరి సినిమాలు 'పేట', 'దర్బార్​', 'అన్నాత్తే'​ కమర్షియల్​గా హిట్ కొట్టినప్పటికీ.. ఆయన రేంజ్​కు తగ్గట్టు ఆడలేదు. ఇక ప్రభాస్ కూడా బాహుబలి సినిమాతో పాన్​ ఇండియా లెవెల్​లో ఎదగడమే కాకుండా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్​కు చెప్పుకోదగ్గ హిట్స్​ ఏమి రాలేదు. సాహో, రాధే శ్యామ్​ సినిమాలు కమర్షియల్​గా హిట్ అయినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆయన ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు స్టార్స్.. తమ కొత్త చిత్రాలతో ​బాక్సాఫీస్ వద్ద ఏమేరకు పోటీ పడతారో. ఒకవేళ నిజంగానే పోటీ పడితే బాక్సాఫీస్​ ముందు ఎవరు గెలుస్తారో.

Last Updated : Mar 4, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.