ETV Bharat / entertainment

NMACC : 'నాటు నాటు' మేనియా.. స్టేజ్​పై స్టెప్పులేసిన​ రష్మిక, ఆలియా

author img

By

Published : Apr 2, 2023, 11:58 AM IST

Updated : Apr 2, 2023, 1:53 PM IST

నీతా అంబానీ కలల ప్రాజెక్టు 'నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌'లో రెండో రోజు తారలు సందడి చేశారు. సల్మాన్​ ఖాన్​, రష్మిక, ఆలియా భట్​ నాటు నాటు పాటకు డ్యాన్స్​ ఇరగదీశారు. ప్రస్తుతం వీరి డ్యాన్స్​కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. మీరూ చూసేయండి.

nitha ambani cultural center rashmika and alia dance for nmacc
nitha ambani cultural center rashmika and alia dance for nmacc

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ 'ఎన్‌ఎంఏసీసీ' (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌)లో సినీ స్టార్స్​ సందడి చేశారు. ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ తారలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్యాన్సులతో అలరించారు. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకచోప్రా, అలియాభట్‌, రష్మిక తదితరులు పలు సూపర్‌హిట్‌ పాటలకు డ్యాన్సులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

కాగా, 'పఠాన్‌' టైటిల్‌ సాంగ్‌కు షారుక్​ ఖాన్​ స్టెప్పులేయగా.. హాల్‌లో ఉన్న ప్రముఖులందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. అనంతరం షారుక్​.. ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలోని 'నాటు నాటు'కు కూడా డ్యాన్స్​ చేశారు. మరోవైపు, ఇదే వేదికపై బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, 'నేషనల్‌ క్రష్‌' రష్మిక 'నాటు నాటు' (హిందీ వెర్షన్‌)కు డ్యాన్స్‌ ఇరగదీశారు. ఈ తారల డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అయితే, ఈ వేడుకల్లో సీనియర్‌ నటి రేఖ, బాలీవుడ్‌ బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, హృతిక్‌ రోషన్‌, నటి సబా అజాద్‌, కాజోల్‌, కృతిసనన్‌, జాకీ ష్రాఫ్‌ తదితరి సినిమా స్టార్స్​ పాల్గొన్నారు. కాగా, భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముకేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీ.. ఈ కల్చరల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభించారు.

అందాల తారల సినిమాల విందు..
'వారసుడు' సినిమాతో ప్రేక్షకులను అలరించిన రష్మిక.. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్​లో బిజీగా ఉంది. 'అర్జున్​ రెడ్డి' సినిమాతో ఘన విజయం సాధించిన సందీప్​ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న 'యానిమల్'​ సినిమాలోనూ రణ్​బీర్​ కపూర్​ సరసన రష్మిక నటిస్తోంది. ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్​తో రూపొందుతోందని తెలుస్తోంది. కాగా, నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల డైరెక్షన్​లో తెరకెక్కుతున్న సినిమాలో ఆడిపాడనుంది ఈ 'నేషనల్​ క్రష్​'.

బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​ విషయానికొస్తే.. రణ్​​వీర్​ సింగ్​ హీరోగా కరణ్​ జోహార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకీ ఔర్​ రాణికి ప్రేమ్​ కహానీ'లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని అనుభవ్​ గుప్తా నిర్మిస్తుండగా.. కరణ్​ జోహార్​ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఫర్హాన్​ అక్తర్ డైరెక్షన్​లో రోడ్​ ట్రిప్​ డ్రామా నేపథ్యంలో వస్తున్న 'జీ లే జరా'లో కూడా ఆలియా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆలియాతో పాటు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్​​ కూడా ఉన్నారు. ఆలియా భట్​, రణ్​వీర్ సింగ్​తో పాటు కరీనా కపూర్​, విక్కీ కౌశల్​, భూమి పెడ్నేకర్​ లాంటి అగ్ర తారాగణంతో వస్తున్న సినిమా 'తక్త్​'. ఈ మూవీకి కరణ్​ అర్జున్​ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్​​ జోహార్​ నిర్మిస్తున్నారు.

  • 📸| Ranveer Singh and Priyanka Chopra performing Gallan goodiyaan at the Great Indian Musical Launch 😍❤️ pic.twitter.com/wbvOR04CbD

    — Ranveer Singh TBT (@Ranveertbt) April 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • 📸| Ranveer Singh performing Tattad Tattad at the Great Indian Musical Launch 😍❤️ #NMACC
    ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀
    ( seems like Gigi Hadid was enjoying RS performance 🤣♥️)#RanveerSingh #GigiHadid pic.twitter.com/kITdtzpkvi

    — Ranveer Singh TBT (@Ranveertbt) April 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Apr 2, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.