ETV Bharat / entertainment

ఆ నటుడితో తమన్నా రొమాన్స్​.. కిస్సింగ్ వీడియో వైరల్​!

author img

By

Published : Jan 2, 2023, 6:47 PM IST

Updated : Jan 2, 2023, 11:00 PM IST

స్టార్ హీరోయిన్​ తమన్నా ఆ నటుడితో డేటింగ్​లో ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు ఓ పార్టీలో ముద్దు పెట్టుకుంటూ కనిపించారు! ఆ వీడియో వైరల్ అవుతోంది.

Netizens spot Tamannaah Bhatia and Vijay Varma 'kissing' in viral video
ఆ నటుడికి తమన్నా ముద్దులు.. డేటింగ్​లో ఉందా?

స్టార్ హీరోయిన్​ ముద్దుగుమ్మ తమన్నా పెళ్లి కబురు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ హాట్​టాపిక్​గా మారింది. అయితే ఈ సారి పెళ్లి కాదు కానీ డేటింగ్​లో ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఎమ్‌సీఎ' న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమ‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ.. న్యూ ఇయర్ వేడుక‌ల్ని అతడితో క‌లిసి గోవాలో స్పెష‌ల్‌గా సెల‌బ్రేట్​ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ సన్నిహితంగా కనిపించారు. మరికొన్ని వీడియోల్లో ముద్దులు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

కాగా, ప్ర‌స్తుతం త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ క‌లిసి ల‌స్ట్ స్టోరీస్ -2లో జంట‌గా న‌టిస్తున్నారు. 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన ల‌స్ట్ స్టోరీస్‌కు కొన‌సాగింపుగా ఇది తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ‌గా మారిన‌ట్లు టాక్​. ఇకపోతే గ‌త కొద్ది రోజులుగా త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్​లో గుర్తింపు.. విజ‌య్ వ‌ర్మ తెలుగువాడే. నాని హీరోగా న‌టించిన ఎమ్‌సీఏ సినిమాతో విల‌న్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్‌లో గ‌ల్లీభాయ్​తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన బాలీవుడ్ సినిమా డార్లింగ్స్‌లో అలియాభ‌ట్‌కు భ‌ర్త‌గా న‌టించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. మంటో, భాగీ-3, యారా సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషించాడు.

ఇదీ చూడండి: Pushpa: రష్యాలోనూ 'తగ్గేదేలే'.. దూసుకెళ్తున్న కలెక్షన్స్‌

Last Updated : Jan 2, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.