ETV Bharat / entertainment

'నా సామిరంగ': సంక్రాంతి పండక్కి నాగార్జున హవా- ఎన్నిసార్లు హిట్ కొట్టాడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 5:09 PM IST

Nagarjuna Akkineni Sankranthi Movies: టాలీవుడ్ ఎవర్​గ్రీన్ మన్మథుడు నాగార్జున సంక్రాంతి ఫైట్​లో మరోసారి హిట్ కొట్టారు. ఆదివారం రిలీజైన నా సామిరంగ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి నాగ్ కెరీర్​లో సంక్రాంతిని ఎన్నిసార్లు బరిలో నిలిచి, హిట్ కొట్టారంటే?

Nagarjuna Akkineni Sankranthi Movies
Nagarjuna Akkineni Sankranthi Movies

Nagarjuna Akkineni Sankranthi Movies: అక్కినేని నాగార్జున 'నా సామిరంగ' సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్​బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్​ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బుకింగ్స్ ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున సినీ కెరీర్​లో ఇప్పటివరకు ఆరుసార్లు పొంగల్ ఫైట్​లో నిలిచి 100 శాతం సక్సెస్ రేట్​ సాధించారు. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం

మజ్ను: 1987లో తొలిసారి నాగార్జున 'మజ్ను' సినిమాతో సంక్రాంతి పోటీలో నిలిచారు. సూపర్ గుడ్​ లవ్​స్టోరీతో తెరెకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దీంతో పొంగల్ బరిలో దిగిన తొలిసారే విజేతగా నిలిచారు నాగార్జున.

కిల్లర్: యాక్షన్ థ్రిల్లర్ జానర్​లో తెరకెక్కిన 'కిల్లర్' 1992 జనవరి 10న రిలీజైంది. హిట్​ టాక్ అందుకున్న ఈ మూవీ 100 రోజులు థియేటర్లలో ఆడింది. తర్వాత ఈ సినిమాను తమిళంలోకి కూడా డబ్బింగ్ చేశారు.

ఆవిడ మా ఆవిడే: నాగార్జున- ఈవీవీ సత్యనారాయణ కాంబోలో తెరకెక్కిన 'ఆవిడ మా ఆవిడే' 1998 సంక్రాంతికి రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా మిక్స్​డ్ టాక్ సొంతం చేసుకున్నా, కలెక్షన్ల పరంగా దూసుకెళ్లి కమర్షియల్ హిట్​గా నిలిచింది.

సోగ్గాడే చిన్ని నాయనా: దాదాపు 18 ఏళ్ల తర్వాత 2016లో నాగార్జున పొంగల్ ఫైట్​లో దిగారు. అంచనాలు లేకుండా 'సోగ్గాడే చిన్ని నాయనా'తో వచ్చి బంపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. 2016 సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలిచి రికార్డు కొట్టింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బంగార్రాజు: 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్​గా రూపొందిందే 'బంగార్రాజు'. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించారు. 2022లో సంక్రాంతి ఫైట్​లో నిలిచి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నా సామిరంగ: 2024లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్​ను బలంగా నమ్ముకున్నారు. 'బంగార్రాజు' రిలీజైన జనవరి 14నే 'నా సామిరంగ' ను విడుదల చేశారు. ఈ పోటీలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్​గా హిట్ టాక్ సొంతం చేసుకుందీ మూవీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నా సామి రంగ' రివ్యూ : నాగార్జున మాస్‌ జాతర ఎలా ఉందంటే?

హిట్​ టాక్​తో దూసుకెళ్తున్న 'నా సామిరంగ' - ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.