ETV Bharat / entertainment

విశాల్​కు నిజంగానే పొగరుంది.. ఎదుటివారికి హాని చేసేలా ఉండకూడదు: మోహన్​ బాబు

author img

By

Published : Dec 19, 2022, 10:56 PM IST

కానిస్టేబుల్‌ పాత్రలో విశాల్‌ నటించిన చిత్రం 'లాఠీ'. ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈమేరకు నిర్వహించిన ఈవెంట్‌కు ప్రముఖ నటుడు మోహన్‌బాబు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశాల్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

vishal laatti movie
vishal laatti movie

దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తమ కుటుంబానికి సంబంధించిన సినిమాల వేడుకలకు తప్ప బయటి వాటికి వెళ్లడం లేదని, విశాల్‌ అడగ్గానే 'లాఠీ' ఫంక్షన్‌కు వచ్చానని ప్రముఖ నటుడు మోహన్‌ బాబు అన్నారు. విశాల్‌ హీరోగా ఎ. వినోద్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'లాఠీ'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, ఎస్‌.డి.హెచ్‌.ఆర్‌ కళాశాలల్లో వేర్వేరుగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఎస్‌.డి.హెచ్‌.ఆర్‌ కాలేజ్‌లో జరిగిన వేడుకకు మోహన్‌ బాబు అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకనుద్దేశించి మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ''తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్‌ ఇక్కడి వచ్చాడు. మనం ఆయన్ను ప్రేమించాలి, గౌరవించాలి. మా సినిమాలకు సంబంధించిన వేడుకలకు మినహా నేను 8 ఏళ్ల నుంచి బయటి వాటికి వెళ్లడంలేదు. విశాల్‌ చనువు తీసుకుని 'అంకుల్‌.. తిరుపతిలో ఫంక్షన్‌ ఉంది. మీరు రావాలి' అని కోరాడు. నేను వెంటనే ఓకే అని చెప్పా. ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. విశాల్‌ తండ్రి నన్ను హీరోగా పెట్టి 'యమ్‌ ధర్మరాజు: ఎంఏ' అనే సినిమా తీశారు. 'పందెం కోడి'లోని విశాల్‌ నటన నాకు బాగా నచ్చింది"

"ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు. 'ప్రేమ చదరంగం', 'పొగరు'లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మెప్పించాడు. విశాల్‌కు నిజంగానే కొంచెం పొగరు ఉందనే సంగతి నాకు తెలుసు. మనిషికి పొగరుండాలి. కానీ, అది ఎదుటివారికి హాని చేసేలా ఉండకూడదు. 'లాఠీ' కానిస్టేబుల్‌ కథ. సమాజంలో ఏం జరిగినా ముందు తెలిసేది కానిస్టేబుల్‌కే. పోలీసు డిపార్ట్‌మెంట్‌ను నేను గౌరవిస్తా. ట్రైలర్‌ చూశా.. బాగుంది. ఈ సినిమా 'పందెం కోడి'లా హిట్‌ అవుతుంది'' అని మోహన్‌ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో విశాల్‌..
''లాఠీ' సినిమాలో నాలుగో అంతస్తు నుంచి దూకే సన్నివేశం ఒకటుంది. దాన్ని రియలిస్టిక్‌గా చేయాలని అక్కడ్నుంచి దూకాను. గాయాలైతే కేరళలో చికిత్స తీసుకున్నా. మీ అందరినీ (అభిమానులు) ఇలా చూసుంటే ఎనిమిదో అంతస్తు నుంచే ధైర్యంగా దూకేవాణ్ని. 18సంవత్సరాల నుంచి నటుడిగా ప్రయాణం సాగిస్తున్నానంటే దానికి కారణం మీరే. నాకొక గుర్తింపు ఇచ్చారు. ఈ సినిమా పోలీసు కానిస్టేబుళ్లందరికీ అంకితమిస్తున్నాం. కాలేజీ రోజుల్లోనే నా లవ్‌ ఫెయిల్‌ అయింది. అప్పటి నుంచే నాకు పరాజయాలు అలవాటు. అవే ఎన్నో పాఠాలు నేర్పుతాయి'' అని విశాల్‌ అన్నారు. అనంతరం అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.