Waltair Veerayya: అదిరిపోయిన 'పూనకాలు లోడింగ్‌' సాంగ్​​.. చిరు స్టెప్పులు సూపరహే!

author img

By

Published : Dec 30, 2022, 6:14 PM IST

waltir veerayya poonakalu song
waltir veerayya poonakalu song ()

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్​ విడుదలైంది.

మెగాస్టార్​ చిరంజీవి మాస్​ గెటప్​లో​ వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదలై ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తున్నాయి. శుక్రవారం ఈ సినిమాలోని మరో పాటను​ రిలీజ్​ చేసింది చిత్రబృందం.

'డోన్ట్​ స్టాప్​ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్​' అంటూ సాగే మరో​ సాంగ్​ అదిరిపోయింది. మాస్​ మ్యూజిక్​ ఉన్న ఈ పాట ఫ్యాన్స్​ ఉర్రూతలూగిస్తోంది.​ అనురాగ్​ రామ్​ మిరియాల, రోల్​ రిడా కలిసి అద్భుతంగా పాడారు. ఇందులో డోన్ట్​ స్టాప్​ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్​ గొంతు అందించారు. చిరుతో పాటు రవితేజ కూడా గొంతు కలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక, ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు బాబీ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2023 జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కానుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.