ETV Bharat / entertainment

గొడవపడిన నాని-కీర్తి సురేశ్.. వీడియో నెట్టింట వైరల్

author img

By

Published : Feb 26, 2023, 7:44 AM IST

ఇటీవల నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అందాల నటి కీర్తి సురేశ్ ఓ వీడియోను పంచుకున్నారు. నాని, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'దసరా' సినిమా షూటింగ్​ సందర్భంగా షటిల్ ఆడిన వీడియోను కీర్తి షేర్​ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

keerthy suresh and nani playing badmintion video
నాని, కీర్తి సురేశ్

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ షటిల్ ఆడే క్రమంలో పాయింట్ల కోసం కోర్టులో వాగ్వాదానికి దిగుతారు. పాయింట్ నాకు అంటే నాకు అని వాదనకు దిగుతారు. అచ్చం అదే రీతిలో నేచురల్ స్టార్ నాని, క్యూట్​ కీర్తి సురేశ్ మధ్య క్యూట్ వాగ్వాదం జరిగింది. ఇటీవల నాని పుట్టిన రోజు సందర్భంగా కీర్తి ఆ వీడియోను షేర్​ చేస్తూ.. నానీకు బర్త్​డే విషెస్​ తెలిపారు.

"ఎప్పుడూ సినిమా గురించి మాత్రమే మాట్లాడే నా స్నేహితుడు, శ్రేయోభిలాషి, నా తోటి నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా సెలబ్రేషన్స్​కు ఇంకా 40 రోజుల కన్నా తక్కువే ఉన్నాయి. 2023ను కుమ్మేసేయ్​ ధరణి" అంటూ వారిద్దరూ కలిసి నటించిన 'దసరా' సినిమా గురించి చెప్పుకొచ్చారు కీర్తి. వీడియోను కూడా 'దసరా' సినిమా సెట్​లోనే తీసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

  • Happy Birthday to my friend, well wisher, co-star who talks all about cinema and only cinema! 😁
    We have less than 40 days to go so let’s save some celebrations for later!
    2023 kummesey Dharani!

    PS: I’m the better photographer 😜#HappyBirthdayNani #Dasara pic.twitter.com/YNGQj8zcV4

    — Keerthy Suresh (@KeerthyOfficial) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న 'దసరా' మూవీలో నానికి జంటగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సుమద్రఖని, మీరా జాస్మిన్, దీక్షిత్ శెట్టి, రోషన్ మాథ్యూ, రాజేంద్ర ప్రసాద్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాని ఓ మాస్ క్యారెక్టర్​లో నటించారు. యాక్షన్​తో కూడిన తెలంగాణ బ్రాక్ డ్రాప్​లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి.

కాగా, నాని ప్రస్తుతం హిట్ 3, నాని 30 సినిమాల్లో నటిస్తున్నారు. కీర్తి సురేశ్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.