ETV Bharat / entertainment

NTR​తో వెట్రిమారన్​ మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్​..!

author img

By

Published : Apr 11, 2023, 10:19 PM IST

కొద్ది రోజులుగా కోలీవుడ్​ స్టార్​ దర్శకుడు​ వెట్రిమారన్‌- జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కనుందని నెట్టింట్లో చర్చ జరిగింది. వెట్రిమారన్​ డైరెక్షన్​లో యంగ్​ టైగర్​ నటిస్తున్నారా? అసలు వెట్రిమారన్​ కథకు ఎన్టీఆర్‌ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేశారా?. అంటూ రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్​ ఫుల్​ క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారంటే..

jr ntr vetrimaaran movie
jr ntr vetrimaaran movie

గత కొంత కాలంగా కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ వెట్రిమారన్‌- జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కనుందంటూ సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వెట్రిమారన్​ డైరెక్షన్​లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారా? అసలు ఆయన కథకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పేశారా?. మల్టీస్టారర్‌గా ఈ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించనుందా? అంటూ అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే, ఈ వార్తలన్నింటికీ సమాధానం చెప్తూ.. వెట్రిమారన్‌ ఇటీవలే స్పందించారు. ఆయన అప్​కమింగ్​ మూవీకి సంబంధించిన ప్రెస్​ మీట్​లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. అంతేకాదు, గతంలో ఆయన తెలుగులో ఏయే హీరోలను కలిశారన్న విషయాన్ని కూడా చెప్పారు.
వెట్రిమారన్​ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన 'విడుదలై:పార్ట్‌-1'. ఇటీవల తమిళ ప్రేక్షకుల అలరింది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో 'విడుదలై : పార్ట్‌-1' అనే టైటిల్​తో ఏప్రిల్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా జరిగిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడారు.

" 'ఆడుకాలం' సినిమా తర్వాత నేనూ అల్లు అర్జున్‌ ఒకటి రెండుసార్లు కలిశాం. ఆ టైమ్​లో నేను తమిళంలో సినిమా చేయాలనుకుంటున్నా. మీకు ఆసక్తి ఉంటే కథ చెప్పండి' అని బన్ని అడిగారు. అప్పుడు నేను రాసుకున్న 'వడ చెన్నై'లోని ఓ పవర్‌ఫుల్‌ పాత్ర గురించి ఆయనకు చెప్పా. కానీ, ఎందుకో కుదరలేదు. తొలుత అనుకున్న వెర్షన్‌లో ఆ పాత్ర ఉంది. ఆ తర్వాత మార్పులు చేశాం. అదే సమయంలో మహేశ్‌ బాబును కూడా కలిసి ఓ కథ చెప్పా. ఎందుకో ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక 'అసురన్‌' మూవీ తర్వాత, లాక్‌డౌన్‌ ముగిశాక ఎన్టీఆర్​ను కలిశా. మేమిద్దరం అనేక విషయాలను మాట్లాడుకున్నాం. అయితే, ఆయనతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. అది సోలో హీరో మూవీనా, లేక మల్టీస్టారరా? అన్న విషయం కాలమే నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న విషయంపై నాకు స్పష్టత ఉంది. స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ వాల్యూ కాకుండా మేము ఎంచుకునే కంటెంట్‌ ఫలానా స్టార్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అతడితో సినిమా చేస్తా" అంటూ వెట్రిమారన్‌ చెప్పుకొచ్చారు.

'విడుదలై : పార్ట్‌1'కు కంట్యునుయేషన్​గా 'పార్ట్‌2' తెరకెక్కించే పనిలో ఉన్నారు. దీని తర్వాత సూర్యతో 'వాడివాసల్' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ తన 30వ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్​ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్‌, వెట్రిమారన్‌ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.