నెం.1,2గా 'జై భీమ్‌', 'జనగణ మన'.. టాప్‌ 10 కోర్టురూమ్‌ డ్రామా మూవీస్​ ఇవే

author img

By

Published : Jan 28, 2023, 2:53 PM IST

Top 10 Court drama movies
టాప్‌ 10 కోర్టురూమ్‌ డ్రామా మూవీస్​ ఇవే ()

కోర్టురూమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కి, అత్యధిక రేటింట్స్‌ సొంతం చేసుకున్న టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను ప్రకటించింది ఐఎండీబీ. ఆ వివరాలు..

సినిమా ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎంత ఫేమసో.. ప్రజలకు న్యాయం అందించే లాయర్​ పాత్రలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించడంలో అంతే సక్సెస్ అవుతుంటాయి. ​మన హీరోలు చాలా మంది న్యాయవాదిగా నటించిన ఆడియెన్స్​ను ఆకట్టుకున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా అన్యాయానికి గురైన ప్రజల గొంతుకగా మారి వారి తరుపున లాయర్స్‌గా హీరోలు కోర్డులో వాదించే సన్నివేశాలు, ఆ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీస్ చాలానే ఉన్నాయి. మరి ఏది టాప్​ లిస్ట్​లో జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ.

ఏ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కింది? ఏ చిత్రాలపై ఎక్కువ మంది ఆసక్తిగా చూపిస్తున్నారు?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తుంటుంది ఈ సంస్థ. అలా ఈ సారి కోర్టురూమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కి, అత్యధిక రేటింట్స్‌ సొంతం చేసుకున్న టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను ప్రకటించింది. తమ యూజర్స్‌ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది.

90ల నుంచి 2023 జనవరి 25 వరకు (న్యాయ పోరాట నేపథ్యంలో రూపొందిన) విడుదలైన సినిమాలన్నింటిపై సర్వే చేసిన అనంతరం.. 8.8 స్టార్‌ రేటింగ్‌తో జై భీమ్‌ తొలి స్థానంలో నిలిచింది. జనగణ మన (8.3) సినిమా ద్వితీయ స్థానం దక్కించుకుంది. మిగిలిన వివరాలివీ.. ట్రైల్‌ బై ఫైర్‌ (8.3), షహిద్‌ (8.2), పింక్ (8.1), గార్గి (8.1), న్నా థాన్‌ కేస్‌ కొడు (8.0), దమిని (7.8), క్రిమినల్‌ జస్టిస్‌: అధుర సాచ్‌ (7.7), కోర్ట్‌ (7.6).

ఇదీ చూడండి: జపాన్​లో RRR సూపర్ రికార్డ్​.. జక్కన్న స్పెషల్ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.