ETV Bharat / entertainment

గుండెపోటుపై స్పందించిన హీరో విక్రమ్‌.. ఏమన్నారంటే..

author img

By

Published : Jul 12, 2022, 1:17 PM IST

Hero Vikram health condition: తనకు గుండెపోటు వచ్చిందంటూ న్యూస్‌ ఛానళ్లతో పాటు, సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంపై స్పందించారు హీరో విక్రమ్​. ప్రస్తుతం తన ఆరోగ్యం ఎలా ఉందనే విషయమై క్లారిటీ ఇచ్చారు.

Vikram health update
గుండెపోటుపై స్పందించిన హీరో విక్రమ్‌

Hero Vikram health condition: ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ న్యూస్‌ ఛానళ్లతో పాటు, సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఆయన తనయుడు ధ్రువ్‌ ఖండించారు. తాజాగా విక్రమ్‌ కూడా స్పందించారు. ఆయన కథానాయకుడిగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కోబ్రా'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విక్రమ్‌ పాల్గొని తన ఆరోగ్యం గురించి మాట్లాడారు.

"ఆ రోజు వచ్చిన వార్తలన్నింటినీ నేను చూశా. జబ్బుపడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫ్‌ చేశారు. ఫొటోపై నా పేరు పెడుతూ థంబ్‌ నెయిల్స్‌ క్రియేట్‌ చేశారు. వాళ్ల క్రియేటివిటీ బాగుంది. థ్యాంక్యూ. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవించా. ఇదేమీ నన్ను పెద్దగా ఆందోళనకు గురిచేయలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇంతకు మించి జీవితంలో నాకేమీ వద్దు" అని అన్నారు. వేదికపై ఆయన ఆద్యంతం ఉత్సాహంగా మాట్లాడారు.

విక్రమ్‌ 'కోబ్రా'లో కథానాయికగా ‘కేజీయఫ్‌’ ఫేం శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ ఏడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ విక్రమ్‌ నటిస్తున్నారు. చోళ రాజుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ఇదీ చూడండి: అవును టైగర్​ష్రాఫ్​తో అది జరగడం నిజమే!: రష్మిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.